విజయ్ ఆంటోనీ తండ్రిది కూడా సూసైడే.. ఏడాదిలో రెండు విషాద ఘటనలు

Published : Sep 19, 2023, 03:36 PM IST
విజయ్ ఆంటోనీ తండ్రిది కూడా సూసైడే.. ఏడాదిలో రెండు విషాద ఘటనలు

సారాంశం

తమిళ నటుడు విజయ్ ఆంటోనీ కూతురు ఆత్మహత్యతో అందరు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనే విజయ్ జీవితంలో మరోటి ఉండటం ఫ్యాన్స్ ను మరింతగా బాధిస్తోంది.   

కోలీవుడ్ నటుడు, మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ ఆంటోనీ (Vijay Antony) తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరయ్యారు. ‘సలీమ్’, ‘బిచ్చగాడు’, ‘బిచ్చగాడు 2’.. రీసెంట్ గా ‘హత్య’ చిత్రాలతో ఆడియెన్స్ ను ఆకట్టుకున్నారు. తనను అభిమానించేలా చేశారు. విభిన్న పాత్రలు, కథలతో ఇప్పటికీ కెరీర్ ను కొనసాగిస్తున్నారు ఆయన. అయితే, కొన్నాళ్లుగా విజయ్ ఇంట్లో అంతా ఆందోళనకర పరిస్థితులు కనిపిస్తున్నాయి.

ఈ ఏడాది జనవరిలో విజయ్ ఆంటోనీనే ‘బిచ్చగాడు 2‘ షూటింగ్ సమయంలో తీవ్రంగా గాయపడ్డ విషయం తెలిసిందే. మలేషియాలో జనవరి 16న యాక్షన్ సీన్లను చిత్రీకరించే సమయంలో బోట్ నుంచి సముద్రంలో పడిపోయారు. అప్పుడే ఆల్మోస్ట్ ఆయన చనిపోయారని భావించారు. దవడ ఎముకలు, ముక్కు బాగా దెబ్బతిన్నాయి. మరణం అంచుల దాకా వెళ్లి వచ్చారు. మూడు నెలల నాణ్యమైన ట్రీట్ మెంట్ తో ప్రాణాలు దక్కించుకున్నారు. ఆ షాక్ నుంచి కోలుకుని కొన్ని నెలలు గడిచిందే లేదో ఇప్పుడు ఆయన కూతురు ఆత్మహత్య చేసుకుంది.

విజయ్ ఆంటోనీ కూతురు మీరా (16) చిన్న వయస్సులో సూసైడ్ చేసుకోవడం అందరినీ బాధిస్తోంది. ముఖ్యంగా ఈ ఏడాదే విజయ్ కి ప్రమాదం, కూతురు మరణంతో కుటుంబ సభ్యలు శోఖసంద్రంలో మునిగిపోయింది. అభిమానులు చింతిస్తున్నారు. స్టే స్ట్రాంగ్ అంటూ సోషల్ మీడియా వేదికన పోస్టులు పెడుతూ ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కాగా, తన కూతురులాగే విజయ్ తండ్రి కూడా సూసైడ్ చేసుకున్నట్టు తెలుస్తోంది. 

గతంలో తన తండ్రి సూసైడ్ గురించి విజయ్ ఓ సందర్భంలో వెల్లడించారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.  ఆ విషాద ఘటన గుర్తు చేస్తూ విజయ్ ఆంటోనీ మాట్లాడుతూ.. ‘జీవితంలో ఎలాంటి సమస్యలు ఎదురైనా వాటికి ఆత్మహత్యలే పరిష్కారం కాదు. పెద్దలు మరణించాక పిల్లల పరిస్థితి తలుకుంటే బాధగా ఉంటుంది. నాకు ఏడేళ్ల వయస్సులో మా నాన్న కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటికే నాకు ఐదేళ్ల చెల్లి కూడా ఉంది. ఆయన సూసైడ్ నా వ్యక్తిగత జీవితంపై చాలా ప్రభావం చూపించింది. ఆ తర్వాత మమ్మల్ని పెంచడానికి అమ్మ చాలా కష్టపడింది. అందుకే సూసైడ్ వార్తలు విన్నప్పుడు నాకు చాలా బాధేస్తోంది. నేనూ చాలా కష్టాలు చూశాను. కానీ ఆత్మహత్య గురించి ఎప్పుడూ ఆలోచించలేదు.’ అంటూ చెప్పుకొచ్చారు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

PREV
click me!

Recommended Stories

Gunde Ninda Gudi Gantalu Today: బాలు పై బయటపడిన ప్రభావతి ప్రేమ, చిటికెలు వేసి మరీ శపథం చేసిన మీన
2025 Flop Movies: 100 కోట్లు దాటినా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌ అయిన 8 సినిమాలు