
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ కాంబినేన్ లో తెరకెక్కిన మల్టీ స్టారర్ మూవీ బ్రో. తమిళ నటుడు, దర్శకుడు సముద్ర ఖని డైరెక్ట్ చేసిన ఈమూవీ.. తమిళంలో వినోదయ సీత్తం కుతెలుగు రీమేక్. తమిళంలో కూడా ఈసినిమాను సముద్రఖని డైరెక్ట్ చేశాడు. తెలుగులో మాత్రం డైరెక్ట్ చేయగా.. స్క్రీన్ ప్లే.. డైలాగ్స్ మాత్రం త్రివిక్రమ్ శ్రీనివాస్ అందించారు. కాగా ఈరోజు (28 జులై) ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన ఈసినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది.
మొదటి నుంచి బ్రో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అంచనాలకు తగ్గట్టు సినిమా అద్భుతంగా ఉండటంతో మెగా ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. మెగా హీరోలు ఇద్దరు కలిసి నటించిన సినిమా కావడంతో.. వారిలో ఉత్సాహం ఉరకలు వేస్తోంది. . మొదటి నుంచే ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.. ఇక తాజాగా ఈసినిమా డిజిటల్ స్ట్రీమింగ్ పై ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ఈసినిమా ఓటీటీ లో రిలీజ్ చేయడం కోసం ముహూర్తం కూడా ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది.
ఓ వైపు బ్రో టికెట్స్ కోసం నానా హంగామా నడుస్తుంది. ఇలాంటి హడావిడి టైంలో ఓటీటీ రిలీజ్ గురించిన న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. సాధారణంగా సినిమా ప్రారంభంలో డిజిటల్ స్ట్రీమింగ్ పార్ట్‌నర్ ఎవరనేది రివీల్ చేస్తారు కాబట్టి అందులో ఎలాంటి సస్పెన్స్ ఉండదు. కాకపోతే ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది క్లారిటీ ఉండదు. ఈ మధ్య స్పై లాంటి కొన్ని సినిమాలు చడీ చప్పుడు లేకుండా ఓటీటీల్లోకి వచ్చేస్తున్నాయి.
ఇక బ్రో విషయానికొస్తే.. మూవీ ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సంస్థ దక్కించుకుంది. పవన్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2 నుంచి స్ట్రీమింగ్ చేయాలని ముహూర్తం కూడా పెట్టారట టీమ్. అయితే ఇవన్నీ షికారు వర్తలే.. మరి అసలు విషయం టీమ్ అనౌన్స్ చేస్తే కాని తెలియదు. ఇదే నిజం అయితే.. థియేటర్లలో రిలీజ్ అయిన 5 వారాల తర్వాత డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి వచ్చేస్తోంది మూవీ. ఇక ఈసినిమా శాటిలైట్ రైట్స్ జీ తెలుగు భారీ ధరకు కొనుగోలు చేసింది.