తేజు, కేతిక శర్మ కెమిస్ట్రీ ఒకవైపు..తమన్ మెలోడీ మ్యాజిక్ మరోవైపు, బ్రో సెకండ్ సింగిల్ అదుర్స్

Published : Jul 15, 2023, 04:47 PM IST
తేజు, కేతిక శర్మ కెమిస్ట్రీ ఒకవైపు..తమన్ మెలోడీ మ్యాజిక్ మరోవైపు, బ్రో సెకండ్ సింగిల్ అదుర్స్

సారాంశం

పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్‌, మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కీలక పాత్రలో నటిస్తున్న బ్రో చిత్ర ప్రమోషన్స్ జోరు పెరుగుతోంది. తమిళ దర్శకుడు, ప్రముఖ నటుడు సముద్రఖని దీనికి దర్శకత్వం వహిస్తున్నారు.

పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్‌, మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కీలక పాత్రలో నటిస్తున్న బ్రో చిత్ర ప్రమోషన్స్ జోరు పెరుగుతోంది. తమిళ దర్శకుడు, ప్రముఖ నటుడు సముద్రఖని దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమా తమిళంలో రూపొంది హిట్‌ అయిన `వినోదయ సీతం` చిత్రానికి రీమేక్‌. తెలుగు నేటివిటీ, పవన్.. తేజు ఇమేజ్ కి తగ్గట్లుగా సముద్రఖని మార్పులు చేసి తెరకెక్కిస్తున్నారు. 

ఇటీవల విడుదలైన టీజర్ కి స్టన్నింగ్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఫస్ట్ సాంగ్ కి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. కాగా తాజాగా సెకండ్ సింగిల్ రిలీజ్ చేశారు. ఇది కంప్లీట్ గా తేజు, కేతిక శర్మ ల డ్యూయెట్ సాంగ్. ఈ సాంగ్ లో తమన్ మెలోడీ మ్యాజిక్ చేశారు. ఇక తేజు, కేతిక శర్మ కెమిస్ట్రీ అయితే యువతకి పండగే అని చెప్పాలి.

జాణవులే నెరజాణవులే అంటూ సాగే ఈ పాటకి కాసర్ల శ్యామ్ మంచి లిరిక్స్ అందించారు. సాంగ్ మొత్తం మంచి బీట్ లో వినసొంపుగా ఉంది. ఈ పాటని తమన్.. గాయని ప్రణతితో కలసి పాడారు. తేజు కేతిక మధ్య రొమాన్స్, లవ్ తెలిపే విధంగా ఈ సాంగ్ ఉంది. దర్శకుడు సముద్ర ఖని విదేశాల్లో మంచి లొకేషన్స్ లో ఈ పాటని చిత్రీకరించినట్లు ఉన్నారు. 

ఈ సాంగ్ లాంచ్ లో అభిమానుల కేరింతల మధ్య సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ.. "మా గురువు, మేనమామ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ప్రేమ, ఆశీస్సులు మాపై ఎల్లప్పుడూ ఉంటాయి. ఆయనతో కలిసి నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే మీ ప్రేమ, అభిమానం నాపై ఎప్పుడూ ఇలాగే కురిపించాలని కోరుకుంటున్నాను. రోడ్డు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. జూలై 28 న థియేటర్లలో గోల చేయడానికి సిద్ధంగా ఉండండి" అన్నారు.

సముద్రఖని మాట్లాడుతూ.. "నా బ్రో సాయి ధరమ్ తేజ్ తో కలిసి పని చేయడం ప్రతిరోజూ పండగలా ఉంటుంది. బిగ్ బ్రో కళ్యాణ్ గారికి థాంక్స్ చెబుతూనే ఉంటాను. సినిమాలో ఆయన దేవుడిలా దిగి వస్తారు. త్రివిక్రమ్ అన్నయ్యకి, నిర్మాతలు విశ్వప్రసాద్ గారు, వివేక్ గారికి ధన్యవాదాలు. జీవితంలో మరిచిపోలేని సినిమా ఇది. మీతో కలిసి ఈ సినిమా చూడటం కోసం జూలై 28 కోసం ఎదురుచూస్తున్నాను" అన్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?
Bigg Boss 9 Remuneration పేదలకు పంచి పెట్టిన ఫైర్ బ్రాండ్ కంటెస్టెంట్, నెటిజన్లు ఏమంటున్నారంటే?