పవన్ ప్రాజెక్టు ఇలా షిఫ్ట్ అయ్యిందా?

Published : Feb 05, 2019, 05:18 PM IST
పవన్ ప్రాజెక్టు ఇలా షిఫ్ట్ అయ్యిందా?

సారాంశం

మెగాస్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా మారిన తరువాత సినిమాలవైపు పెద్దగా ఇంట్రెస్ట్ చూపడం లేదు. ఫైనల్ గా ఇండస్ట్రీలో ఆయన కనిపించరని అర్ధమయిపోయింది. అయితే అంతకుముందు ఒకే చేసిన ప్రాజెక్టుల సంఖ్య పెద్దగానే ఉంది. పవన్ తో సినిమా చేయాలనీ చాలా మంది నిర్మాతలు ఆశపడ్డారు. 

కొంతమంది అడ్వాన్స్ కూడా ఇచ్చారు. అందులో ఏఎమ్.రత్నం ఒకరు. ఖుషి లాంటి సక్సెస్ సినిమా చేసిన కాంబో గనక అంచనాలు భారీగానే పెరిగాయి. అయితే మెగాపవర్ స్టార్ అజ్ఞాతవాసి అనంతరం పాలిటిక్స్ కారణంగా నిర్ణయాలు మార్చుకోవడంతో ఏఎమ్.రత్నం సందిగ్ధంలో పడ్డారు. రీసెంట్ గా పవన్ నిర్మాతకు ఒక మాట ఇచ్చాడట. 

నెక్స్ట్ సాయి ధరమ్ తేజ్ తో సినిమా చేయండి అంటూ తనకు ఇప్పుడు సినిమా చేసే ఆలోచన లేదని పవన్ క్లియర్ గా క్లారిటీ ఇచ్చేశాడట. సాయి ధరమ్ తేజ్ తో కూడా మాట్లాడతానని పవన్ చెప్పేశాడు. అయితే పవన్ రెమ్యునరేషన్ తిరిగిచ్చిన విషయంలో ఇంతవరకు ఓ క్లారిటీ లేదు. ఏఎమ్.రత్నం కూడా పవన్ నిర్ణయానికి సానుకూలంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఓ మంచి కథను కూడా వెతికే పనిలో పడ్డారు. అయితే సాయి ధరమ్ తేజ్ కు ఇప్పుడు పెద్దగా సక్సెస్ రేట్ లేదు. మరి అతను ఎంతవరకు ఏఎమ్.రత్నంకు హిట్టిస్తాడో చూడాలి.  

PREV
click me!

Recommended Stories

చిరంజీవి ఇండస్ట్రీకి మొగుడవుతాడని ముందే చెప్పిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
Boyapati Movies:పవన్ మూవీతో పోటీ పడి అట్టర్ ఫ్లాప్ అయిన బోయపాటి సినిమా ఏంటో తెలుసా.. రెండింటిపై భారీ అంచనాలు