
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనుకున్నది అనుకున్నట్టు జరగడం లేదు. భీమ్లా నాయక్ తరువాత హరిహరవీరమల్లును స్పీడప్ చేయాలి అనుకున్నారు. కాని ఎంత కష్టపడుతున్నా.. ఈ సినిమా ఓ కొలిక్కి వచ్చేట్టు కనిపించడం లేదు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - క్రిష్ కాంబినేషన్లో హరి హర వీరమల్లు సినిమా సెట్స్ పైకి వెళ్లి చాలాకాలమే అవుతుంది. అయితే ముందుగా భీమ్లా నాయక్ కంప్లీట్ చేయాలని ఆ సినిమాపై ఎక్కువగా దృష్టి పెట్టాడు పవర్ స్టార్. ఇక కరోనా కారణంగా కొన్నాళ్లు .. పవన్ నిర్ణయాల కారణంగా కొన్నాళ్లు వీరమల్లు షూటింగు విషయంలో డిలే అవుతూ వచ్చింది. రీసెంట్ గా మళ్లీ ఈ సినిమా షూటింగు స్టార్ట్ అయ్యింది కాని.. అనుకున్నట్టుగా ముందుకు సాగడంలేదట.
ఇప్పటికే 50 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా, మిగతా 50 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకోవల్సి ఉంది. అయితే హిస్టారికల్ సినిమా అవ్వడంతో తెలియకుండానా ఈసినిమాకు పని ఎక్కువగా ఉందట. ఈ సినిమా కోసం భారీ సెట్లను వేయించారు. కొన్ని గ్రౌండ్స్ ను కూడా రెడీ చేశారు. ఈ లొకేషన్లలో నాన్ స్టాప్ గా షూటింగును పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఆ ప్రణాళిక ప్రకారమే అన్ని పనులు జరుగుతున్నాయి.
అంతా అనుకున్నట్టుగా జరిగితే ఈ దసరాకి సినిమా రిలీజ్ చేయాలి అని ప్లాన్ చేస్తున్నారట. అయితే ఈ సినిమా కోసం చాలా వర్క్ చేయాల్సి ఉంటుంది. ఒక వేళ అనుకున్నట్టు దసరాకి రిలీజ్ చేయలేకపోతే.. 2023 సంక్రాంతికి రిలీజ్ చేయాలనే ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా సమాచారం.
కీరవాణి సంగీతం హరిహరవీరమల్లు సినిమాకు ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. ఇక ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ గా కన్నడ బ్యూటీ నిధి అగర్వాల్ అందాల సందడి చేయనుంది. అర్జున్ రాంపాల్ ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాడు. ఈ మధ్య ఈ సినిమా కాస్ట్యూమ్స్ విషయంలో పవర్ స్టార్ అసంతృప్తి వ్యాక్తం చేశారని సమాచారం. సెట్స్ అంతా బాగున్నాయని కితాబిచ్చినట్టు తెలుస్తోంది.