లెజెండరీ రైటర్స్‌ పరుచూరి బ్రదర్స్‌ ఇంట విషాదం

Published : Aug 07, 2020, 09:22 AM IST
లెజెండరీ రైటర్స్‌ పరుచూరి బ్రదర్స్‌ ఇంట విషాదం

సారాంశం

ప‌రుచూరి వెంకటేశ్వరరావు స‌తీమ‌ణి విజ‌య‌ల‌క్ష్మి శుక్ర‌వారం తెల్లవారుజామున గుండెపోటుతో కన్నుమూశారు. ఆమె వయసు 74 సంవత్సరాలు. విజయలక్ష్మి మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపాన్ని తెలియ‌జేశారు.

టాలీవుడ్ ప్ర‌ముఖ ర‌చ‌యిత పరుచూరి బ్రదర్స్‌లో ఒకరైన ప‌రుచూరి వెంకటేశ్వరరావు ఇంట విషాదం నెల‌కొంది. ఆయ‌న స‌తీమ‌ణి విజ‌య‌ల‌క్ష్మి శుక్ర‌వారం తెల్లవారుజామున గుండెపోటుతో కన్నుమూశారు. ఆమె వయసు 74 సంవత్సరాలు. విజయలక్ష్మి మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపాన్ని తెలియ‌జేశారు.

టాలీవుడ్‌ లో మాస్ కమర్షియల్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు పరుచూరి బ్రదర్స్. ఎన్టీఆర్‌ నుంచి ఈ జనరేషన్ హీరోల వరకు అందరికీ సూపర్‌ హిట్‌ చిత్రాలను అందించారు. కథలు, సంభాషణలు రాయటంతో ఈ ధ్వయం తిరుగులేని ఇమేజ్‌ సొంతం చేసుకుంది. ఇటీవల చిరంజీవి హీరోగా తెరకెక్కిన సైరా నరసింహారెడ్డి సినిమాకు వీరు అందించిన సహకారం ఎంతో ఉంది.

ఎన్టీఆర్‌, ఎ.ఎన్‌.ఆర్‌, కృష్ణ‌, శోభ‌న్‌బాబు, కృష్ణంరాజు చిరజీవి, బాల‌కృష్ణ‌, నాగార్జున‌, వెంక‌టేశ్ స‌హా ప‌లువురు అగ్ర క‌థానాయ‌కులంద‌రి సినిమాల‌కు ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్(ప‌రుచూరి వెంక‌టేశ్వ‌ర‌రావు, ప‌రుచూరి గోపాల‌కృష్ణ‌) రచయతలుగా పని చేశారు.

PREV
click me!

Recommended Stories

MSG Day 2 Collection: బాక్సాఫీసు వద్ద మన శంకర వర ప్రసాద్‌ గారు ర్యాంపేజ్‌.. చిరంజీవి సక్సెస్‌ పార్టీ
AOR Movie Review: అనగనగా ఒక రాజు మూవీ రివ్యూ.. నవీన్‌ పొలిశెట్టి నవ్వించాడా?