నరసింహారెడ్డి కాదు అని నిరూపించగలరా.. పరుచూరి ఛాలెంజ్!

By tirumala ANFirst Published Sep 27, 2019, 8:55 PM IST
Highlights

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం సైరా. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 2న రిలీజ్ కు సిద్ధం అవుతోంది. సురేందర్ రెడ్డి ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో రాణించే చిత్రంగా తెరక్కించారు. 

సైరా విడుదలకు సిద్ధం అవుతుండడంతో అభిమానుల్లో ఉత్కంఠ పెరుగుతోంది. సైరా విశేషాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్ర సినిమాగా మారడానికి మూలకారకులు పరుచూరి బ్రదర్స్. ఈ కథని సిద్ధం చేసింది వారే. దశాబ్దాలుగా చిరంజీవి ఈ చిత్రం చేస్తారని వారు ఎదురుచూశారు. ఎట్టకేలకు ఆ కల ఫలించింది. 

ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పరుచూరి వెంకటేశ్వర రావు హాజరయ్యారు. కానీ అయన సోదరుడు గోపాలకృష్ణ హాజరు కాలేదు. దీనిపై పరుచూరి గోపాలకృష్ణ క్లారిటీ ఇచ్చారు. 22వ తేదీన ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగింది. 20వ తేదీ నుంచే నేను అనారోగ్యానికి గురయ్యా. బయటకు రాలేని పరిస్థితిలో ఉన్నా. ప్రీరిలీజ్ ఈవెంట్ కు హాజరు కాలేకపోతున్నందుకు చాలా బాధపడ్డా. చిరంజీవి గారు కూడా విచారం వ్యక్తం చేశారు. ఆయన స్వయంగా నా కోసం డాక్టర్ ని పంపించారు. 

ఇదిలా ఉండగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి స్వాతంత్రం కోసం పోరాడిన తొలి యోధుడు అని మనం చెప్పుకుంటున్నాం. ఆయనకన్నా ముందుగా వీరపాండ్య కట్టబ్రహ్మణ లాంటి వారు స్వాతంత్రం కోసం పోరాడారని కొందరు అంటున్నారు. అది కరెక్ట్ కాదు అని పరుచూరి తెలిపారు. మాకు స్వాతంత్రం కావాలి.. ఈ దేశాన్ని విడిచి వెళ్లిపోండి అని పోరాటం చేసిన మొదటి యోధుడ ఉయ్యాలవాడ. 

వీరపాండ్య కట్టబ్రహ్మణ తన రాజ్యాన్ని రక్షించుకునేందుకు మాత్రమే బ్రిటిష్ వారితో పోరాడారు. ఆయన పోరాటం స్వాతంత్రం కోసం కాదు అని పరుచూరి అన్నారు. కట్టబ్రహ్మణ స్వాతంత్రం కోసం పోరాడినట్లు ఎక్కడైనా చరిత్రలో ఉంటే నిరూపించగలరా అని సైరా విషయంలో వివాదం సృష్టిస్తున్న వారికి పరుచూరి సవాల్ విసిరారు. 

click me!