పాత కథే మరి వర్కవుట్ అవుతుందా?

Published : Jun 05, 2018, 11:47 AM IST
పాత కథే మరి వర్కవుట్ అవుతుందా?

సారాంశం

''చెప్పుకోవడానికి ఇదేం కొత్త కథ కాదు.. దేశం పుట్టినప్పటి నుండి మనం చెప్పుకునే కథే..' 

''చెప్పుకోవడానికి ఇదేం కొత్త కథ కాదు.. దేశం పుట్టినప్పటి నుండి మనం చెప్పుకునే కథే..' అంటున్నాడు గోపీచంద్. ఈ మధ్యకాలంలో గోపీచంద్ కెరీర్ కు ఉపయోగపడే ఒక్క సినిమా కూడా రాలేదు. మూస ధోరణిలో సినిమాలు చేసుకుంటూ హీరోగా వెనకబడిపోతున్న గోపీచంద్ ఈసారి 'పంతం' ఫర్ ఎ కాజ్ అంటూ ప్రేక్షకులను పలకరించనున్నాడు. తాజాగా ఈ సినిమా టీజర్ ను విడుదల చేసింది చిత్రబృందం.

ఇందులో.. ''ఫ్రీగా ఇల్లు ఇస్తాం.. కరెంట్ ఇస్తాం.. రుణాలు మాఫీ చేస్తాం అనగానే ఓటుకి 5 వేలు ఇస్తాం అనగానే ముందు.. వెనక.. మంచి.. చెడు.. ఆలోచించకుండానే ఓటేసేసి అవినీతి లేని సమాజం కావాలి, కరెప్షన్ లేని కంట్రీ కావాలంటే ఎక్కడ నుంచి వస్తాయ్'' అంటూ గోపీచంద్ పలికిన డైలాగ్ ఆలోచింపజేస్తుంది. దర్శకుడు చక్రవర్తి రూపొందించిన ఈ సినిమాలో మెహ్రీన్ హీరోయిన్ గా కనిపించనుంది. 

 

PREV
click me!

Recommended Stories

Nani Paradise Aaya Sher Song: యూట్యూబ్ లో దుమ్మురేపుతోంది.. సోషల్ మీడియాను షేక్ చేస్తోంది !
Rachita Ram: డింపుల్ క్వీన్ రచితా రామ్ ఇంత ఫేమస్ ఎలా అయ్యింది? ఆ సీక్రెట్ ఇదే!