‘కొండపొలం’: మొదట అనుకున్న టైటిల్ వేరే, స్టోరీ లైన్

By Surya PrakashFirst Published Oct 2, 2021, 7:11 AM IST
Highlights

మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా క్రిష్‌ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘కొండపొలం’. ఇందులో రకుల్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఎమ్‌ఎమ్‌ కిరవాణి సంగీతం అందిస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన పాటలు సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

మొదట చిత్రం ‘ఉప్పెన’ సక్సెస్ తో ఓవర్ నైట్ లో స్టార్ గా మారిన  వైష్ణవ్ తేజ్ నటించిన రెండో సినిమా ‘కొండపొలం’. ప్రముఖ రచయిత సన్నపురెడ్డి వెంకటరామి రెడ్డి రాసిన ‘కొండపొలం’ నవల ఆధారంగా తెరకెక్కిందీ సినిమా. రకుల్ ప్రీత్ సింగ్, సాయిచంద్, కోట శ్రీనివాసరావు, రవిప్రకాశ్, హేమ తదితరులు కీలక పాత్రలు పోషించిన ‘కొండపొలం’ సినిమాను క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వంలో రాజీవ్ రెడ్డి, సాయిబాబు నిర్మించారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం సమకూర్చారు. ఈ నవలా చిత్రాన్ని ఇదే నెల 8న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం గురించిన విశేషాలు చూద్దాం. 

మొదట సినిమాకు ‘వనవాసి’ అనే టైటిల్‌ పెట్టాలనుకున్నారు. స్థానికతను ప్రేక్షకులు బాగా ఇష్టపడుతుండటంతో చివరికి దర్శకుడు క్రిష్‌ ‘కొండపొలం’ అనే టైటిల్‌ ఖరారు చేశారు.ఇక మనం భూమిని సాగుచేసి పంటను పండిస్తే... దాన్ని పొలం అంటాం. అదే సహజసిద్ధంగా ప్రకృతే పంటను ఇచ్చే   ప్రదేశాన్ని ‘కొండపొలం’ అంటారు. అడవిలో ఆ ఫలాన్ని పొందడానికి గొర్రెల కాపారుల చేసే ప్రయాణాన్నే ‘కొండపొలం’ అంటారు. ఈ పదం కడపజిల్లా పోరుమామిళ్ల, జ్యోతి... ఈ చుట్టు పక్కల ప్రాంతాల్లో వారికే తెలుసు.

చిత్రం స్టోరీ లైన్ ఏమిటంటే... భయం, బిడియంతో నలిగిపోతున్న రవీంద్రయాదవ్‌ అనే యువకుడిని అడవి ఎలా ధైర్యవంతుడిగా మార్చిందనేది. కడప ప్రాంతం నేపథ్యం, ఇక్కడి మనుషుల జీవన విధానం, అందులోని పోరాటం ఈ సినిమాలో కనపడతాయి.  నవలలో హీరోయిన్ పాత్ర ఉండదు. సినిమా కోసం దాన్ని ప్రత్యేకంగా రాశారు. నవలలోని పుల్లయ్య పాత్ర మనవరాలిగా రకుల్‌ప్రీత్‌సింగ్‌ పాత్ర ఉంటుంది.  కొండ‌పొలంలో గొర్ల‌కాప‌రుల జీవితాలు, బాధ‌లు, క‌ష్టాలు .. అన్ని మిళిత‌మై ఉంటాయి. 

ఇక ఈ చిత్రాన్ని మొదట నల్లమల ప్రాంతంలోనే తీయాలని ప్లాన్ వేశారు. కరోనా, లాక్‌డౌన్‌ పరిస్థితులతో వేరే చోట తీయాల్సి వచ్చింది. పైగా నల్లమల టైగర్‌ జోన్‌ కావడంతో అనుమతులు క్లిష్టమయ్యాయి. విజువల్స్‌ చూస్తే... నల్లమల ప్రాంతం లాగే అనిపించేలా చేశారు. సంగీతం, గ్రాఫిక్స్‌ చిత్రానికి అదనపు బలాన్ని తీసుకొచ్చాయి. మాండలికం నేర్చుకోవడానికి అందరూ చాలా కృషి చేశారు. నటులందరికీ ప్రత్యేక శిక్షణ ఇప్పించారు క్రిష్‌. 
 

click me!