Bigg Boss Telugu 7: సింహానికి ఆకలెక్కువ, నాకు పవరెక్కువ.. మాస్‌ డైలాగ్‌లతో రెచ్చిపోయిన పల్లవి ప్రశాంత్‌..

Published : Nov 20, 2023, 07:15 PM ISTUpdated : Nov 20, 2023, 07:19 PM IST
Bigg Boss Telugu 7: సింహానికి ఆకలెక్కువ, నాకు పవరెక్కువ.. మాస్‌ డైలాగ్‌లతో రెచ్చిపోయిన పల్లవి ప్రశాంత్‌..

సారాంశం

పల్లవి ప్రశాంత్‌, రతిక మరోసారి ఒకరిపై ఒకరు ఫైర్‌ అయ్యారు. వాదోపవాదనలతో రెచ్చిపోయారు. ఇందులో ప్రశాంత్‌ .. మాస్‌ డైలాగ్‌లతో ఇచ్చిన కౌంటర్‌ హైలైట్ గా నిలిచింది. 

బిగ్‌ బాస్‌ తెలుగు ఏడో సీజన్‌ అంతా ఉల్టా పుల్టా అని మొదట్నుంచి హోస్ట్ నాగార్జున చెబుతూ వస్తున్నారు. అలాంటి పరిణామాలే హౌజ్‌లో చోటు చేసుకున్నాయి. ఎలిమినేషన్‌, ఐదుగురు కంటెస్టెంట్లు వైడ్డ్ కార్డ్ ద్వారా రావడం. దీంతోపాటు ఎలిమినేట్‌ అయిన గౌతమ్‌, రతిక ప్రత్యేక ఓటింగ్‌ ద్వారా రావడం జరిగింది. ఈ వారం కూడా ఎలిమినేషన్‌ చేయలేదు. యావర్‌ ఎవిక్షన్‌ ఫ్రీ పాస్‌ వెనక్కి ఇవ్వడంతో ఎలిమినేసన్‌రద్దు చేసినట్టు చెప్పారు. 

అంతేకాదు వచ్చే వారం(12వ వారం) డబుల్‌ ఎలిమినేషన్‌ ఉంటుందన్నారు. దీంతో వచ్చే వారం ఎవరు ఎలిమినేట్‌ అవుతారనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో సోమవారం ఎపిసోడ్‌లో నామినేషన్ల ప్రక్రియ సాగింది. అది ఆద్యంతం రసవత్తరంగా సాగినట్టు ప్రోమోలను చూస్తుంటే అర్థమవుతుంది. అందులో భాగంగా పల్లవి ప్రశాంత్‌ టార్గెట్‌గా ఓ ప్రోమోని విడుదల చేశారు బిగ్‌ బాస్‌ నిర్వహకులు. ఇందులో ఆయన్ని రతిక, గౌతమ్‌ టార్గెట్‌ చేయడం విశేషం. ప్రశాంత్ నిజ స్వరూపం ఇది అని చెప్పే ప్రయత్నం చేశారు. 

మొదట రతిక.. పల్లవి ప్రశాంత్‌ని పిలిచింది. ఇద్దరు చూసి ముసి ముసి నవ్వులు నవ్వుకోవడం ఆకట్టుకుంది. ఇక వీరిద్దరి మధ్య కన్వర్జేషన్‌లో చూసిన నీకు అన్యాయం జరిగిందని అనిపిస్తుంది, అది నీ తప్పు నా తప్పు కాదు. నీది అయిపోతే నేను మాట్లాడతా అని రతిక చెప్పగా, నువ్వు నాకు నామినేషన్‌ ల ఏ పాయింట్‌ కనిపించలేదు, నువ్వు చాలా సేఫ్‌ ఆడినవ్‌ అని చెప్పారు ప్రశాంత్‌. నువ్వు ఎన్ని ఇటుకలు సేకరించాడు, పల్లవి ప్రశాంత్‌ మేథావి శక్తి ఇది అంటూ రెచ్చిపోయింది రతిక. అనంతరం ప్రశాంత్‌ రెచ్చిపోయాడు.. అక్కా సింహానికి ఆకలెక్కువ, పల్లవి ప్రశాంత్‌కి పవర్‌ ఎక్కువ. సింహాం ఆకలి కోసం వేటాడుతది, పల్లవి ప్రశాంత్‌ ఆకలి కోసం ఆట ఆడుతాడు` అని చెప్పగా, కట్‌ బాగుంది డైలాగ్‌ అని రతిక ఎద్దేవా చేయడం, దానికి ప్రశాంత్‌ రియాక్షన్‌ ఆకట్టుకుంది. 

మరోవైపు రతిక.. అమర్‌దీప్‌తోనూ వాదనకి దిగింది. ఆయన్ని నామినేట్‌ చేస్తూ, క్లాస్‌ పీకేలా నామినేషన్‌ స్టార్ట్ చేసింది. 15వ వారంలో ఎంత మంది ఉంటారని రతిక అడిగింది, తెలియదని అమర్‌ దీప్ చెప్పాడు. నీకేది తెలియదు చెబుతున్నా విను అనగా, సింహాం మీసాలు నిమిరుతూ అమర్‌ దీప్‌ ఇచ్చిన యాక్షన్‌ అదిరిపోయింది. కౌంట్‌ చేయి ఎన్ని ఉన్నాయో అనగా, చేశానని అమర్‌ దీప్‌ చెప్పాడు, దీనికి మళ్లీ ఇది రిపీట్‌ అవ్వద్దు అని రతిక వార్నింగ్‌ ఇస్తున్నట్టుగా చెప్పడం ఆశ్చర్యంగా ఉంది.

మరోవైపు ప్రశాంత్‌, గౌతమ్‌ మధ్య వాదన గట్టిగానే సాగింది. ఇందులో నువ్వు అట్ల మాట్లాడాలనుకుంటే నేనొచ్చి మాట్లాడటానికి సిద్ధంగా లేను అని గౌతమ్‌ చెప్పాడు. నా పంచె ఆనవాయితీ లెక్క నీక్కూడా అని గౌతమ్‌ చెప్పగా, ఆ పంచె ఊసిపోకుండా కాపాడుకో అని ప్రశాంత్‌ అన్నాడు. దీనికి గౌతమ్‌ ఫైర్‌ అయ్యాడు. ఎక్కువ తక్కువ మాట్లాడకు అని గౌతమ్‌, బరాబర్‌ మాట్లాడతా అని ప్రశాంత్‌ గట్టిగా వాదించాడు. పంచె అనేది తెలుగోడి సంస్కృతి దాని గురించి మాట్లాడటం మంచిది కాదంటూ ఫైర్‌ అయ్యాడు గౌతమ్‌. ప్రోమోలో చాలా హాట్‌ హాట్‌గా ఈ వాదనలు జరిగాయి. ఎపిసోడ్‌పై ఆసక్తిని రేకెత్తించాయి. అయితే ఈ వారం శివాజీ, పల్లవి ప్రశాంత్‌, అమర్‌ దీప్‌, అర్జున్‌, గౌతమ్‌, అశ్విని, రతిక, యావర్‌ నామినేట్‌ అయినట్టు తెలుస్తుంది. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Krishnam Raju: చిరంజీవి ఇలా మనసు పడ్డాడో లేదో, మెడలో ఖరీదైన గిఫ్ట్ పెట్టిన కృష్ణంరాజు.. మర్చిపోలేని బర్త్ డే
మడత మంచం పై పడుకొని, ప్రకృతిని ఆస్వాదిస్తున్న అనసూయ