శర్వా సినిమా నిండా ముంచేసినట్లే?

By Prashanth MFirst Published Dec 30, 2018, 11:56 AM IST
Highlights

మంచి కాన్సెప్ట్ ఉన్నంతమాత్రన బడ్జెట్ పెంచాల్సిన రూల్ ఏమి లేదు. అలాగని పెంచకూడదు అనే బార్డర్ ని కూడా నిర్మించాల్సిన అవసరం లేదు. అన్ని అలోచించి హెచ్చుతగ్గుల గురించి ఒక నిర్ణయం తీసుకోవాలి. 

మంచి కాన్సెప్ట్ ఉన్నంతమాత్రన బడ్జెట్ పెంచాల్సిన రూల్ ఏమి లేదు. అలాగని పెంచకూడదు అనే బార్డర్ ని కూడా నిర్మించాల్సిన అవసరం లేదు. అన్ని అలోచించి హెచ్చుతగ్గుల గురించి ఒక నిర్ణయం తీసుకోవాలి. అయితే పడి పడి లేచే మనసు విషయంలో మాత్రం ప్లాన్ మొత్తం రివర్స్ అయ్యింది. 

దర్శకుడు హను రాఘవపూడి ఓవర్ కాన్ఫిడెన్స్ నిర్మాతను నిండా ముంచేసింది. అసలు శర్వానంద్ మార్కెట్ ను లెక్క చేయకుండా 20 కోట్లల్లో అనుకున్న సినిమాకు 32 కోట్ల దాకా ఖర్చు చేశారు. అయితే సినిమా కాన్సెప్ట్ ప్రేక్షకులకు ఏ మాత్రం ఎక్కలేదు. ఎంత డిఫరెంట్ సినిమా చేసినా ఆడియెన్ కు నచ్చితేనే హిట్ అవుతుంది. 

అంతే గాని నలుగురు నమ్మినంత మాత్రాన లోకం మొత్తం ఒప్పుకోకపోవచ్చు. పడి పడి లేచే మనసు నిర్మాతను దాదాపు నష్టాల ఊబిలో కురుకుపోయేలా చేస్తోంది. సినిమా 10 కోట్ల వరకు కలెక్ట్ చేయగా 18 కోట్లు నష్టం వచ్చినట్లు తెలుస్తోంది. మరి ఈ దెబ్బతో దర్శకుడు హను రాఘవపూడి నెక్స్ట్ ఏ విధంగా అడుగులు వేస్తాడో చూడాలి.  

click me!