‘డాన్స్ ఐకాన్' షో ఫస్ట్ లుక్ ను విడుదల చేసిన ‘ఆహా’.. ఓటీటీలోకి యాంకర్ ఓంకార్ ఎంట్రీ..

By team teluguFirst Published Aug 22, 2022, 3:26 PM IST
Highlights

ప్రేక్షకాదరణ పొందిన ప్రముఖ ఓటీటీ సంస్థ ‘ఆహా’(Aha). తన వ్యూయర్స్ ను మరింత అలరించేందుకు ‘డాన్స్ ఐకాన్’ పేరిట కొత్త షోను తీసుకొస్తోంది. తాజాగా ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసింది.  

అనతి కాలంలో లక్షలాది వ్యూయర్స్ ను సొంతం చేసుకున్న ప్రముఖ ఓటీటీ సంస్థ ‘ఆహా’. ప్రేక్షకులకు నచ్చే కంటెంట్ అందించడంలో ఎప్పుడూ ముందుంటుంది. ఇప్పటికే అదిరిపోయే సినిమాలను, రియాలిటీ టాక్ షోలను అందించిన విషయం తెలిసిందే. తాజాగా సరికొత్త డాన్స్ షోతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ‘డాన్స్’ అనే పదం వినపడగానే ప్రతి ఒక్కరికీ వారిలో ఉన్న ఒక డ్యాన్సర్ బయటికొస్తారు. కానీ అందులోంచి ఆణిముత్యాలని వెతికి, వారి ప్రతిభను లోకానికి చూపించడానికి 'డాన్స్ ఐకాన్' షో (Dance Icon)తో వచ్చేస్తుంది. మన అందరికి ఎంతో ఇష్టమైన, వందశాతం  లోకల్ ఓటీటీ ప్లాట్ ఫామ్, ఎప్పుడూ తన అభిమానులని ఎలా అలరించాలని ఆలోచించే సంస్థ ఆహా. 

ఇప్పటికే  తెలుగు ఇండియన్ ఐడల్ సింగింగ్ రియాలిటీ షోను ఓటీటీ ద్వారా ప్రేక్షకులకు అందించింది. ఈ షో మంచి సక్సెస్ ను అందుకోవడంతో..  తర్వాత మరోసారి ప్రతిభ ఉన్న నృత్యకళాకారులతో వచ్చేస్తుంది. తెలుగు లోగిల్లలో అన్నయ్య అని పిలవబడే ఓంకార్ (Omkar) కూడా ఈ షోతో ఓటీటీ ప్రపంచంలోకి అడుగుపెట్టబోతున్నారు.  షోకి ఆయన యాంకర్ గా వ్యవహరిస్తూనే..  మరోవైపు ప్రొడ్యూసర్ గానూ బాధ్యతలు స్వీకరించారు. త్వరలో లాంఛ్ కానున్న ఈ షోకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను రీసెంట్ గా ‘ఆహా’ విడుదల చేసింది. ‘డాన్స్ ఐకాన్’ టైటిల్ తో పాటు.. స్టైలిష్ లుక్ లో దర్శనమిచ్చిన ఓంకార్ తో కూడిన పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది. 

ఈ షో గురించి యాంకర్ మరియు ప్రొడ్యూసర్ ఓంకార్ మాట్లాడుతూ.. ‘షో ద్వారా నేను ఓటిటి ప్లాట్ఫామ్ లోకి అడుగుపెడుతున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కు, ఆహా కు ప్రత్యేక ధన్యవాదాలు.  నేను ఎన్నో డ్యాన్స్ షోస్ కు వ్యాఖ్యాతగా వ్వయహరించాను.  కానీ ‘డాన్స్ ఐకాన్’ మాత్రం చాలా డిఫరెంట్ గా ఉండబోతుంది. ఈ షో కంటెస్టెంట్స్ తో పాటు వారిని కొరియోగ్రాఫ్ చేసే మాస్టర్స్ జీవితాల్ని కూడా మార్చేస్తుంది. గెలిచిన కంటెస్టెంట్ యొక్క కొరియోగ్రాఫర్ కు టాలీవుడ్ లో ఒక పెద్ద హీరో కి డాన్స్ కొరియోగ్రఫీ చేసే అవకాశం వస్తుంది. అందరు ఈ షో ని ఆదరిస్తారని భావిస్తున్నాన’ని తెలిపారు. త్వరలో షోకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించనున్నారు. 

click me!