పవన్ ఫ్యాన్స్ కి మరో అదిరిపోయే సంక్రాంతి గిఫ్ట్!

By team teluguFirst Published Jan 15, 2021, 2:51 PM IST
Highlights

పెద్ద పండుగ సంక్రాంతి చివరి రోజు మరో బిగ్ సర్ప్రైజ్ పవన్ ఫ్యాన్స్ కోసం సిద్ధంగా ఉంది. పవన్ ప్రకటించిన అయ్యప్పనుమ్ కోశియుమ్ రీమేక్ నుండి నేడు సాయంత్రం 6:03 నిమిషాలకు అప్డేట్ రానుంది. ఈ మేరకు చిత్ర నిర్మాతలు కొద్దిసేపటి క్రితం ప్రకటన విడుదల చేశారు. 
 

2021 సంక్రాంతి పవన్ ఫ్యాన్స్ కి చాలా ప్రత్యేకంగా నిలిచింది. తమ అభిమాన హీరో పవన్ నటించిన వకీల్ సాబ్ మూవీ టీజర్ రూపంలో వారికి పెద్ద గిఫ్ట్ అందింది. నిన్న సాయంత్రం విడుదలైన వకీల్ సాబ్ టీజర్ ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ ని విశేషంగా ఆకట్టుకుంది. లాయర్ గా పవన్ డైలాగ్స్ అండ్ లుక్స్ ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇచ్చాయి. సమ్మర్ కానుకగా విడుదల కానున్న వకీల్ సాబ్ టీజర్ అన్ని విధాలా ఫ్యాన్స్ ని ఫిదా చేసింది. 


ఇక విడుదలైన నిమిషాల వ్యవధిలో మిలియన్స్ వ్యూస్ దక్కించుకున్న వకీల్ సాబ్ టీజర్ మూవీపై అంచనాలు పెంచేసింది. కాగా పెద్ద పండుగ సంక్రాంతి చివరి రోజు మరో బిగ్ సర్ప్రైజ్ పవన్ ఫ్యాన్స్ కోసం సిద్ధంగా ఉంది. పవన్ ప్రకటించిన అయ్యప్పనుమ్ కోశియుమ్ రీమేక్ నుండి నేడు సాయంత్రం 6:03 నిమిషాలకు అప్డేట్ రానుంది.ఈ మేరకు చిత్ర నిర్మాతలు కొద్దిసేపటి క్రితం ప్రకటన విడుదల చేశారు. 

అయ్యప్పనుమ్ కోశియుమ్ రీమేక్ ఇటీవలే అధికారికంగా ప్రారంభం అయ్యింది. దగ్గుబాటి రానా ఈ మూవీలో పవన్ తోపాటు మరో హీరోగా నటిస్తున్నారు. దీనితో నేడు సాయంత్రం రానున్న ఆ అప్డేట్ ఏమై ఉంటుందని ఫ్యాన్స్ ఆతృతగా ఉన్నారు. ఇలా పవన్ తన ఫ్యాన్స్ కి ఊహించని డబుల్ ట్రేట్స్ ఇస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా... సాగర్ కె చంద్ర తెరకెక్కిస్తున్నారు. 
 

Get ready folks !! ❤️🎧💫🎵 🗯🎶🔈📢 pic.twitter.com/4v3OKKgJrS

— thaman S (@MusicThaman)
click me!