NBK 108 నుండి బాలయ్య లేటెస్ట్ లుక్ లీక్!

Published : Jun 07, 2023, 04:31 PM IST
NBK 108 నుండి బాలయ్య లేటెస్ట్ లుక్ లీక్!

సారాంశం

బాలయ్య తన లేటెస్ట్ మూవీ షూటింగ్ శరవేగంగా పూర్తి చేస్తున్నారు. దసరా కానుకగా ఈ చిత్రం విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు. NBK 108 సెట్స్ నుండి ఆయన లేటెస్ట్ లుక్ లీక్ అయ్యింది.   

నందమూరి నటసింహం బాలయ్య ఫుల్ ఫార్మ్ లో ఉన్నారు. అఖండ, వీరసింహారెడ్డి చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇచ్చారు. అఖండ చిత్ర విడుదలకు ముందు బాలయ్య మార్కెట్ పూర్తిగా దెబ్బతింది. కనీసం ఐదు కోట్ల షేర్ కూడా వసూలు చేయలేని పరిస్థితి. ఈ క్రమంలో అచ్చొచ్చిన దర్శకుడిని నమ్ముకుని సక్సెస్ అయ్యాడు. బోయాపాటి శ్రీను బాలయ్య అభిమానుల నమ్మకం నిలబెడుతూ బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చాడు. 

2023 సంక్రాంతి కానుకగా విడుదలైన వీరసింహారెడ్డి మూవీతో మరో విజయం ఖాతాలో వేసుకున్నాడు. ఏడాది ప్రారంభంలోనే మరో చిత్రం పట్టాలెక్కించారు. దర్శకుడు నిల్ రావిపూడితో చేసిన 108వ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. దసరా కానుకగా ఈ చిత్రం విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు. కాగా ఈ చిత్ర సెట్స్ నుండి బాలయ్య లేటెస్ట్ లుక్ లీక్ అయ్యింది. టీడీపీ నేత బాలయ్యను NBక 108చిత్ర సెట్స్ లో కలిశారు. ఆ ఫోటోను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అవుతుంది. 

కోర మీసం, చెవికి పోగులు, మెడలో కండుగా వేసుకుని బాలయ్య కార్మిక నాయకుడు గెటప్ లో కనిపిస్తున్నారు. బాలయ్య ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ దక్కింది. ఈ చిత్రం తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని దర్శకుడు అనిల్ రావిపూడి చెప్పారు. బాలయ్య చేసే పాత్ర ఏమిటనేది ఇంకా స్పష్టత రాలేదు. 

కాజల్ అగర్వాల్ కెరీర్లో మొదటిసారి బాలకృష్ణకు జంటగా నటిస్తుంది. యంగ్ బ్యూటీ శ్రీలీల కీలక రోల్ చేస్తుంది. ఈ చిత్రంపై పరిశ్రమలో పాజిటివ్ బజ్ ఉంది. బాలయ్య ఫ్యాన్స్ ఈ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Karthika Deepam 2 Today Episode: జ్యోకు మాటిచ్చిన దీప- తాళి కట్టమంటే కడతావా అని ప్రశ్నించిన శ్రీధర్
Dooradarshini Review: దూరదర్శని మూవీ రివ్యూ.. వింటేజ్‌ విలేజ్‌ లవ్‌ స్టోరీ ఎలా ఉందంటే?