ఆమ్లెట్ కోసం అమ్మతో గొడవపడ్డ అభిజిత్...అరియనా కారణంగా రేగిన రచ్చ

Published : Nov 06, 2020, 12:11 AM IST
ఆమ్లెట్ కోసం అమ్మతో గొడవపడ్డ అభిజిత్...అరియనా కారణంగా రేగిన రచ్చ

సారాంశం

బిగ్ బాస్ ఇచ్చిన పల్లెకు పోదాం టాస్క్ కూడా అనేక వివాదాలకు కారణం అవుతుంది. అభిజిత్, అమ్మ రాజశేఖర్ మధ్య కోల్డ్ వార్ నడుస్తూనే ఉంది. అభిజిత్ ఇంటి సభ్యులలో అమ్మ రాజశేఖర్, అవినాష్ మరియు అరియనా పట్ల కోపంగా ఉంటున్నారు. ఏ చిన్న సంధర్భం దొరికినా వీరి మధ్య గొడవ మొదలవుతుంది.

టాస్క్ ఏదైనా బిగ్ బాస్ హౌస్ లో గొడవలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా అమ్మ రాజశేఖర్ మరియు అభిజిత్ మధ్య తరచుగా గొడవలు జరుగుతున్నాయి. పల్లెటూరు టాస్క్ లో కూడా ఆరియానా ఫుడ్ విషయంలో గొడవ జరిగింది. 

పల్లెటూరి టాస్క్ లో ఊరి పెద్ద కూతురు రోల్ చేస్తున్న ఆరియానా ఆమ్లెట్ కావాలని కోరగా హోటల్ యజమాని రోల్ చేస్తున్న అభిజిత్ నిరాకరించారు. మీరు దంచి ఇచ్చిన బియ్యానికి ఆమ్లెట్ ఇవ్వడం కుదరదని ఖరాఖండిగా చెప్పడం జరిగింది. దీనితో అరియనా అభిజిత్ తో గొడవకు దిగారు. ప్రతి టాస్క్ లో ఇలానే అభిజిత్ అడ్డంకులు పెడుతున్నాడని, ఆహారం ఇవ్వక పోతే టాస్క్ ఎలా సాగుతుందని అరియనా వాదానికి దిగింది. 

ఐతే రూల్స్ ప్రకారమే ఆడుతున్నానని అభిజిత్ మరోమారు అరియనాతో గొడవకు దిగాడు. ఆకలితో ఇబ్బంది పడుతున్న అరియనాకు ఆమ్లెట్ తెస్తానని కిచెన్ లోకి అమ్మ రాజశేఖర్ రావడం జరిగింది. కిచెన్ లో అభిజిత్  మరియు అమ్మ రాజశేఖర్ మధ్య మరో  గొడవ జరిగింది. అన్నం, పప్పుతో పాటు ఆమ్లెట్ ఇవ్వడం కుదరదని అభిజిత్ చెప్పడంతో, అమ్మ రాజశేఖర్ కి కోపం వచ్చింది. మోనాల్ పట్టుకున్న అన్నం ప్లేట్ ని వద్దని కొట్టి కోపంగా బయటికి వచ్చేశారు. 

PREV
click me!

Recommended Stories

Dhurandhar vs Avatar 3: అవతార్ 3కి చుక్కలు చూపించిన ధురంధర్.. బాక్సాఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్లు
బాహుబలి కంటే ముందు రమ్యకృష్ణ కెరీర్ లో ఐకానిక్ మూవీ.. 25 ఏళ్ళ తర్వాత తొలిసారి థియేటర్ లో చూస్తూ, వైరల్