నీ మీద నాకున్న ఇష్టాన్ని ఎప్పటికీ ఊహించలేవు: జాన్వీకపూర్!

By Udayavani DhuliFirst Published Nov 5, 2018, 2:18 PM IST
Highlights

దివంగత శ్రీదేవి పెద్ద కూతురు, బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ తన చెల్లెలు ఖుషీ కపూర్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఇన్స్టాగ్రామ్ లో జాన్వీ పోస్ట్ చేసిన వీడియో నెటిజన్ల దృష్టిని ఆకట్టుకుంటోంది. 

చిన్నప్పుడు జాన్వీ.. ఖుషీతో కలిసి టీవీ ముందు డాన్స్ చేస్తోన్న వీడియో అది. ఈ ఇద్దరు సిస్టర్స్ తమ క్యూట్ డాన్స్ తో ఆకట్టుకుంటున్నారు. ఈ వీడియో షేర్ చేస్తూ.. 'చిన్ననాటి నుండి నీ నుండి నేను ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాననే దానికి ఉదాహరణ ఇది.

అయినా.. నువ్వంటే నాకెంతో ఇష్టం. ఎంత అంటే నువ్వు ఎప్పటికీ ఊహించలేనంతగా... హ్యాపీ బర్త్ డే' అంటూ క్యాప్షన్ ఇచ్చింది. గతంలో పలు సందర్భాల్లో కూడా జాన్వీ తన చెల్లెలు ఖుషీ గురించి చెప్పింది.

తనకి ఎంతో సపోర్ట్ ఇస్తుందని.. చెల్లి అనడం కంటే అక్క అనడం బెటరేమో అంటూ వెల్లడించింది. ఇప్పుడు ఖుషీ కపూర్ కూడా జాన్వీలానే హీరోయిన్ అవ్వడానికి సిద్ధమవుతోంది. 
 
click me!