
ప్రభాస్ హీరోగా వచ్చిన ఆదిపురుష్ చిత్రం ఏ స్దాయిలో విమర్శల పాలైందో అందరికీ తెలిసిందే. ‘రామాయణం’లో మార్పులు చేయడమే కాకుండా, దేవుళ్లతో ఊరమాస్ డైలాగులు చెప్పించడంపై సర్వత్రా విమర్శలు ఎదురయ్యాయి. ఫలితంగా రూ.500 కోట్లతో తెరకెక్కించిన ఈ గ్రాఫిక్ వండర్.. డిజస్టర్‌గా మిగిలిపోయింది. ‘ఆదిపురుష్’ మూవీ మేకర్స్‌పై అలహాబాద్ హైకోర్ట్ సైతం అసహనం వ్యక్తం చేసింది. సెన్సార్ బోర్డు తీరుపై మండిపడింది. దాంతో ఇప్పుడు దేవుళ్ల కాన్సెప్టుపై వచ్చే చిత్రాలపై సెన్సార్ బోర్డ్ ఆచి,తూచి వ్యవహారించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. తాజాగా ఆ దెబ్బ OMG 2పై పడిందని ముంబై ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది.
అక్షయ్ కుమార్ నటించిన ‘ఓ మై గాడ్’ చిత్రం 2012లో విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచిన ఈ సినిమాను తెలుగు, కన్నడ భాషల్లో కూడా రీమేక్ చేశారు. తెలుగులో పవర్ స్టార్ పవన్ కల్యాణ్, వెంకటేష్ హీరోలుగా గోపాల గోపాల పేరుతో రిలీజై విజయం సాధించింది. ఇప్పుడు ఓ మై గాడ్ సినిమాకు సీక్వెల్ సిద్ధమైంది. ఆగస్ట్ 11న సినిమాను విడుదల చేయనున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది. ఈ సారి అక్షయ్ శివుడి అవతారంలో కనిపించనున్నాడు. ప్రస్తుతం ఓమైగాడ్ 2 సంబంధించిన పోస్టర్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. తాజాగా ఈ సినిమా టీజర్‌ను విడుదల అయ్యింది.
బాలీవుడ్ మీడియా నుంచి అందుతున్న సమాచారం మేరకు ..‘ఓమైగాడ్ 2’ మూవీపై సెన్సార్ బోర్డ్ అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ‘ఆదిపురుష్’ మూవీపై చేసిన పొరపాటు ‘ఓఎంజీ 2’లో రిపీట్ కాకుండా జాగ్రత్తలు పడుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సెన్సార్ కంటే ముందు.. ఈ మూవీలో ప్రజల మనోభావాలు దెబ్బతీసే డైలాగులు, సీన్లు ఏమైనా ఉన్నాయేమో పరిశీలించాలంటూ CBFC (సెన్సార్ బోర్డ్).. రివ్యూ కమిటీని కోరినట్లు తెలిసింది. కమిటీ నిర్ణయం తర్వాత ఈ మూవీకి సర్టిపికెట్ జారీ చేయడం లేదా మార్పులు సూచించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. చివరి దశలో అన్నీ పరిశీలించిన తర్వాతే మూవీ రిలీజ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అప్పటివరకు ఆ మూవీ విడుదలను ఆపాలని కోరినట్లు వార్తలు వస్తున్నాయి.
కాగా 2021లో విడుదలైన ‘సూర్యవంశీ’ తర్వాత అక్షయ్ చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి. ‘బచ్చన్ పాండే’, ‘సామ్రాట్ పృథ్వీరాజ్’, ‘రక్షా బంధన్’, ‘రామ్ సేతు’ వంటి అనేక ఇతర చిత్రాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపర్చాయి. ఇక ఈ ఏడాది విడుదలైన ‘సెల్ఫీ’ సినిమా కూడా డిజాస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు అక్షయ్ ఆశలన్నీ ఓమైగాడ్ సీక్వెల్ మీదనే ఉన్నాయి.