సిక్స్ ప్యాక్ బాడీలో కేక పుట్టిస్తున్న నాగ శౌర్య... లేటెస్ట్ ఫోటో వైరల్!

Published : Jun 15, 2021, 10:10 AM IST
సిక్స్ ప్యాక్ బాడీలో కేక పుట్టిస్తున్న నాగ శౌర్య... లేటెస్ట్ ఫోటో వైరల్!

సారాంశం

సిక్స్ ప్యాక్ లేని యువ హీరోలు లేరంటే అతిశయోక్తికాదు. తాజాగా ఈ లిస్ట్ లోకి చేరాడు హీరో నాగ శౌర్య. లవర్ బాయ్ ఇమేజ్ తో మంచి విజయాలు అందుకున్న నాగ శౌర్య మాస్ హీరోగా ఎదిగే ప్రయత్నాలలో ఉన్నారు.   

ఈతరంలో హీరోగా నెగ్గుకు రావడం అంత ఈజీ ఏమీ కాదు. ముఖ్యంగా హీరో అంటే సిక్స్ ప్యాక్ బాడీతో పాటు మల్టీ టాలెంట్స్ అవసరం. ఒకప్పుడు హాలీవుడ్, బాలీవుడ్ కే పరిమితమైన సిక్స్ ప్యాక్ ట్రెండ్ టాలీవుడ్ కి కూడా పాకింది. సిక్స్ ప్యాక్ లేని యువ హీరోలు లేరంటే అతిశయోక్తికాదు. తాజాగా ఈ లిస్ట్ లోకి చేరాడు హీరో నాగ శౌర్య. లవర్ బాయ్ ఇమేజ్ తో మంచి విజయాలు అందుకున్న నాగ శౌర్య మాస్ హీరోగా ఎదిగే ప్రయత్నాలలో ఉన్నారు. 


ఆయన గత చిత్రం అశ్వద్ధామ అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. ఈ సినిమాలో భారీ ఫైట్స్ తో ఇరగదీశాడు నాగ శౌర్య. కాగా లక్ష్య మూవీ కోసం నాగ శౌర్య సిక్స్ ప్యాక్ బాడీ సిద్ధం చేశాడు. ప్రొఫెషనల్ ఆర్చర్ గా లక్ష్య మూవీలో కనిపించనున్నాడు. తాజాగా ఈ యంగ్‌ హీరో జిమ్‌ వర్కవుట్‌ ఫోటో ఒకటి సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌ అవుతోంది. ఇందులో నాగ శౌర్య మాచో రిప్డ్‌ లుక్‌లో కండలు తిరిగిన బాడీలో కనిపిస్తున్నాడు. పాత్రకు తగ్గట్లు శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకునేందుకు జిమ్‌లో తెగ కష్టపడుతున్నారు. 
 

ఇటీవలే హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ అనౌన్స్‌ చేసిన మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ 2020లో నాగశౌర్య 5వ స్థానాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.ప్రస్తుతం ఈ యంగ్‌ హీరో వరుడు కావలెను, లక్ష్య, ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి చిత్రాల్లో నటిస్తున్నాడు. హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా సొంత బ్యానర్ లో సినిమాలు నిర్మిస్తున్నారు ఆయన. 
 

PREV
click me!

Recommended Stories

తనూజతో రొమాంటిక్ మూమెంట్స్, సంతోషంతో పొంగిపోయిన కళ్యాణ్.. సంజనకి ఓజీ రేంజ్ ఎలివేషన్
ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు