NTR: ఆ సమస్యతో బాధపడుతున్న ఎన్టీఆర్... ఇక కొరటాల మూవీ పరిస్థితి ఏంటంటే!

Published : Aug 07, 2022, 11:59 AM IST
NTR: ఆ సమస్యతో బాధపడుతున్న ఎన్టీఆర్... ఇక కొరటాల మూవీ పరిస్థితి ఏంటంటే!

సారాంశం

ఆర్ ఆర్ ఆర్ తో ఎన్టీఆర్ పాన్ ఇండియా హిట్ కొట్టారు. ఆయన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఈ ఊపులో ఎన్టీఆర్ తన నెక్స్ట్ మూవీ స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నారు. అయితే వాళ్లకు ఓ బ్యాడ్ న్యూస్.   

ఆర్ ఆర్ ఆర్ మూవీ వరల్డ్ వైడ్ వసూళ్ల వరద పారించింది. రూ. 1100 కోట్లకు పైగా వసూళ్లతో సత్తా చాటింది. ఆర్ ఆర్ ఆర్ హీరోలైన ఎన్టీఆర్, రామ్ చరణ్ గ్లోబల్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ విజువల్ వండర్ గురించి హాలీవుడ్ ప్రత్యేకంగా చెప్పుకోవడం విశేషం. మరోవైపు ఆర్ ఆర్ ఆర్ తర్వాత చరణ్ ఆచార్యతో ప్రేక్షకులను పలకరించాడు. అలాగే దర్శకుడు శంకర్ తో చేస్తున్న ఆర్సీ 15 షూటింగ్  చకచకా పూర్తి చేస్తున్నాడు. ఎన్టీఆర్ మాత్రం ఖాళీగా ఉన్నారు. 

దర్శకుడు కొరటాల శివతో ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీ ప్రకటించారు. ఎన్టీఆర్ 30వ(NTR 30 ) చిత్రంగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ మోషన్ పోస్టర్ సైతం విడుదల చేశారు. సినిమా మాత్రం ససేమిరా పట్టాలెక్కడం లేదు. ఆచార్య మూవీ డిజాస్టర్ కావడంతో బయ్యర్లు నిండా మునిగిపోయారు. ఈ మూవీ ఆర్థిక లావాదేవీల్లో తలదూర్చిన కొరటాల అనేక ఇబ్బందులు ఫేస్ చేశారు. ఆ సమస్యల నుండి బయటపడే సరికి చాలా ఆలస్యమైంది. ఇక ఆచార్య ఫలితం నేపథ్యంలో ఎన్టీఆర్ కోసం స్క్రిప్ట్ పక్కాగా సిద్ధం చేసే పనిలో ఉన్నారు. 

మరోవైపు ఎన్టీఆర్(NTR) కూడా ఓ సమస్యతో బాధపడుతున్నారట. ఆయనను భుజం నొప్పి ఇబ్బంది పెడుతుందట. కొన్నాళ్లుగా ఎన్టీఆర్ ఈ సమస్యను ఎదుర్కొంటున్నారట. బింబిసార ప్రీ రిలీజ్ ఈవెంట్ కి నొప్పితోనే కాదనలేక హాజరయ్యారట. ఇక డాక్టర్స్ ఆయనను కొన్ని వారాలు విశ్రాంతి తీసుకోవాలని సలహా ఇచ్చారట. ఈ క్రమంలో ఎన్టీఆర్ 30 అక్టోబర్ లో సెట్స్ పైకి వెళ్లనుందట. దీంతో 2023 చివర్లో లేదా 2024 ప్రారంభంలో ఈ మూవీ విడుదలయ్యే సూచనలు కలవు అంటున్నారు. మొదటిగా ఎన్టీఆర్ కి జంటగా అలియా భట్ అనుకున్నారు. అనుకోని కారణాలతో ఆమె ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారు. ఎన్టీఆర్ కోసం హీరోయిన్ ని నిర్ణయించాల్సి ఉంది. 
 

PREV
click me!

Recommended Stories

Tortoise First Look: అస్సలు గుర్తు పట్టలేని విధంగా రాజ్ తరుణ్, ఇంత వైల్డ్ గా ఉన్నాడేంటి
Korean Kanakaraju: థియేటర్స్ లో సక్సెస్, ఓటీటీ స్ట్రీమింగ్ వరుణ్ తేజ్ మూవీ రెడీ.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే