`ఆర్‌ఆర్‌ఆర్‌` సెట్‌లో ఎన్టీఆర్‌, చరణ్‌, రాజమౌళి చిల్లింగ్‌.. తారక్‌కి ఆ గాయమేంటి?

Published : Aug 07, 2021, 06:46 PM IST
`ఆర్‌ఆర్‌ఆర్‌` సెట్‌లో  ఎన్టీఆర్‌, చరణ్‌, రాజమౌళి చిల్లింగ్‌.. తారక్‌కి ఆ గాయమేంటి?

సారాంశం

ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ప్రస్తుతం ఉక్రేయిన్‌లో లాస్ట్ షెడ్యూల్‌ని షూట్‌ చేస్తున్నారు. షూటింగ్‌ గ్యాప్‌లో రాజమౌళి, ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ చిల్‌ అవుతున్నారు. 

ఇండియాలో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రం `ఆర్‌ఆర్‌ఆర్‌`. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ నటిస్తున్న చిత్రమిది. స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొనడానికి ముందు, యంగర్‌ ఏజ్‌లో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు, గోండు వీరుడు కొమురం భీమ్‌  ఎక్కడికి వెళ్లారు? ఏం చేశారనే కథాంశంతో ఫిక్షనల్‌ స్టోరీతో దర్శకుడు రాజమౌళి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. దీనికి జక్కన తండ్రి, రైటర్‌ విజయేంద్రప్రసాద్‌ కథ అందించారు. ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ప్రస్తుతం ఉక్రేయిన్‌లో లాస్ట్ షెడ్యూల్‌ని షూట్‌ చేస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ పాల్గొంటున్నారు. 

వీరిద్దరిపై సాంగ్‌ని చిత్రీకరిస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే టాకీ పార్ట్ పూర్తయ్యిందని యూనిట్‌ వెల్లడించింది. రెండు పాటలు మాత్రమే బ్యాలెన్స్ ఉన్నట్టు తెలిపారు. ఇప్పటికే హైదరాబాద్‌లో ఓ సాంగ్‌ని చిత్రీకరించారు. ఇప్పుడు ఉక్రేయిన్‌లో మరో పాటని చిత్రీకరిస్తున్నారట. అయితే షూటింగ్‌ గ్యాప్‌లో రాజమౌళి, ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ చిల్‌ అవుతున్నారు. ఎన్టీఆర్‌ని చరణ్‌ కొట్టేందుకు ప్రయత్నించి విరమించారు. దీనికి తారక్‌ రియాక్ట్ కావడం, వీరిద్దరి మధ్య సన్నివేశాలను రాజమౌళి కెమెరాతో షూట్‌ చేస్తున్నట్టుగా ఉండటం, చివరికి చరణ్‌ కట్‌ చెప్పడం ఆకట్టుకుంటుంది. 

సరదాగా ఈ ముగ్గురి స్టార్స్ మధ్య జరిగిన ఈ సన్నివేశం ఆద్యంతం ఆకట్టుకుంటుంది. సోషల్‌ మీడియాలోవైరల్‌ అవుతుంది. అయితే ఇందులో ఎన్టీఆర్‌ నుదుటిపై ఎడమవైపు గాయం కనిపించడం షాక్‌కి గురి చేస్తుంది. షూటింగ్‌లో భాగంగా తారక్‌కి గాయమైందా? అనే సందేహాలు కలుగుతున్నాయి. వీరిద్దరి మధ్య చిల్‌ అయ్యే వీడియో కంటే ఎన్టీఆర్‌కి గాయమైందా? అనే విషయమే తెగ వైరల్‌ అవుతుండటం విశేషం.

ఇక ఈ సినిమాలో అలియాభట్‌, ఒలివియా మోర్రీస్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. అజయ్‌ దేవగన్‌, సముద్రఖని, శ్రియా కీలక పాత్రలు పోషిస్తున్నారు. డివివి దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని అక్టోబర్‌ 13న ప్రపంచ వ్యాప్తంగా పది భాషల్లో విడుదలకు ప్లాన్‌ చేస్తున్నారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Karthika Deepam 2 Today Episode: జ్యోకు కార్తీక్ వార్నింగ్- జైల్లోనే కాశీ- శ్రీధర్ పై పారు ఫైర్
Nuvvu Naaku Nachav చూసి ఇక సినిమాల నుంచి తప్పుకుందామనుకున్న త్రివిక్రమ్‌.. అసలు ఏం జరిగిందంటే?