RamCharan about NTR: చనిపోయేంత వరకు తారక్‌తో సోదరభావం మనసులో పెట్టుకుంటాః రామ్‌చరణ్‌ భావోద్వేగం

Published : Dec 27, 2021, 11:45 PM ISTUpdated : Dec 27, 2021, 11:52 PM IST
RamCharan about NTR: చనిపోయేంత వరకు తారక్‌తో సోదరభావం మనసులో పెట్టుకుంటాః రామ్‌చరణ్‌ భావోద్వేగం

సారాంశం

ఈవెంట్‌లో రాజమౌళి.. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌లపై ప్రశంసలు కురిపించారు. మరోవైపు చరణ్‌ సైతం రాజమౌళి, ఎన్టీఆర్‌పై ప్రశంసలు కురిపించారు. ఎన్టీఆర్‌ లాంటి బ్రదర్ దొరకడం తమ అదృష్టమన్నారు. 

మెగా పవర్ స్టార్‌ రామ్‌చరణ్‌.. యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌పై ప్రశంసలు కురిపించారు. ఆయన గురించి చెబుతూ చాలా ఎమోషనల్‌ అయ్యారు. తనకు `ఆర్‌ఆర్‌ఆర్‌` సినిమాతో మంచి బ్రదర్‌ దొరికాడని, అందుకు దేవుడికి థ్యాంక్స్ చెప్పాడు చరణ్‌. ఎన్టీఆర్‌, చరణ్‌ కలిసి నటించిన `ఆర్‌ఆర్‌ఆర్‌` సినిమా జనవరి 7న విడుదల కానుంది. ఈ సందర్బంగా ప్రమోషన్‌లో భాగంగా సోమవారం సాయంత్రం చెన్నైలో ప్రీరిలీజ్‌ ఈవెంట్ ని నిర్వహించారు.ఇందులో రాజమౌళి, ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ పాల్గొన్నారు. 

ఈ ఈవెంట్‌లో రాజమౌళి.. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌లపై ప్రశంసలు కురిపించారు. మరోవైపు చరణ్‌ సైతం రాజమౌళి, ఎన్టీఆర్‌పై ప్రశంసలు కురిపించారు. ఎన్టీఆర్‌ లాంటి బ్రదర్ దొరకడం తమ అదృష్టమన్నారు. `ఆర్‌ఆర్‌ఆర్‌` సినిమాతో తారక్‌తో బ్రదర్‌వుడ్‌ని చాలా ఇష్టపడ్డానని తెలిపారు. ఆ స్నేహం మరింత బలపడిందని పేర్కొన్నారు. `నేను చనిపోయేంత వరకు ఆ సోదరభావం నా మనసులో పెట్టుకుంటా` అని తెలిపారు. తారక్‌ రియల్‌ లైజ్‌లో చైల్డ్ లాంటి మనస్తత్వం అని, సింహాం లాంటి పర్సనాలిటీ అని తెలిపారు. ఆయనతో జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. తారక్‌ లాంటి బ్రదర్‌నిచ్చినందుకు దేవుడుకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నానని అని, అయితే ఎన్టీఆర్‌కి మాత్రం తాను థ్యాంక్స్ చెప్పి దూరం పెట్టుకోలేనని తెలిపారు. ఎన్టీఆర్‌ అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. 

మరోవైపు రాజమౌళి గురించి చెబుతూ, నా గురువు అనాలా? హెడ్ మాస్టర్‌ అనాలా? గైడ్‌ అనాలా? నాకు ఇండస్ట్రీ ఫస్ట్ హిట్‌ ఇచ్చిన డైరెక్టర్‌ అనాలా? మా రాజమౌళిగారికి థ్యాంక్యూ.. మమ్మల్ని కలిపి ఒక సినిమా తీసినందుకు. రాజమౌళి గురించి చెప్పాలంటే ఒక స్టేజ్‌ సరిపోదు` అని చెప్పారు రామ్‌చరణ్‌. ఈ సందర్భంగా లైకా ప్రొడక్షన్‌, రాజమౌళి టీమ్‌కి, `ఆర్‌ఆర్‌ఆర్‌` టీమ్‌కి, నిర్మాత దానయ్యకి, కీరవాణికి ధన్యవాదాలు తెలిపారు రామ్‌చరణ్‌. అంతేకాదు విజయ్‌, సూర్య, అజిత్‌, శివకార్తికేయలపై ప్రశంసలు కురిపించారు చరణ్‌. వారి సినిమాలను బాగా ఎంజాయ్‌ చేస్తానని చెప్పారు. ఇదిలా ఉంటే చెన్నైలోనూ తెలుగు ఆడియెన్స్ సందడి చేయడం విశేషం. ఎన్టీఆర్‌, చరణ్‌ అభిమానులు భారీగా తరలివెళ్లడం విశేషం. 

also read: RRR Pre Release Event: ఎన్టీఆర్‌ ఇండియన్‌ సినిమా చేసుకున్న అదృష్టం.. చరణ్‌ అరుదైన నటుడుః రాజమౌళి ఎమోషనల్‌

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss telugu 9 లో మిడ్ వీక్ ఎలిమినేషన్, ఆ ఇద్దరిలో బయటకు వెళ్లేది ఎవరు?
Aadarsha Kutumbam: వెంకటేష్‌ హౌజ్‌ నెంబర్‌ బయటపెట్టిన త్రివిక్రమ్‌.. చాలా ఆదర్శ కుటుంబం