ఫ్యామిలీతో దుబాయ్ కి వెళ్తోన్న ఎన్టీఆర్..!

Published : Feb 11, 2019, 02:15 PM IST
ఫ్యామిలీతో దుబాయ్ కి వెళ్తోన్న ఎన్టీఆర్..!

సారాంశం

దర్శకధీరుడు రాజమౌళి 'RRR'సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. హీరో రామ్ చరణ్ పై కొన్ని వందల మందితో ఫైట్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నారు. ఓ పక్క చరణ్ షూటింగ్ లో పాల్గొంటుంటే మరో హీరో తారక్ మాత్రం షూటింగ్ లో కనిపించడం లేదు. 

ప్రస్తుతం ఎన్టీఆర్ కి సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ లేకపోవడంతో ఎన్టీఆర్ తన ఫ్యామిలీతో కలిసి దుబాయ్ కి వెళ్తున్నాడు. దీనికి సంబంధించిన ఫోటోలు ఆన్ లైన్ లో చక్కర్లు కొడుతున్నాయి. తన భార్య లక్ష్మీప్రణతి, పెద్ద కొడుకు అభయ్ రామ్ లతో కలిసి ఎన్టీఆర్ దుబాయ్ కి పయనమయ్యాడు.

హైదరాబాద్ రాజీవ్ గాంధి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ వద్ద ఎన్టీఆర్ క్యూలో నిలబడడం ఆయన అభిమానులు ఫోటోలు తీశారు. తారక్ దుబాయ్ కి వెళ్లేది 'RRR'కి  సంబంధించి  కొంత ఎక్విప్మెంట్ అలానే తన క్యారెక్టర్ కి తగట్లు బట్టలు కొనడానికి వెళ్లినట్లు సమాచారం.

సాధారణంగా ఎన్టీఆర్ దుబాయ్ లోనే షాపింగ్ చేస్తుంటాడు. కానీ ఈసారి సినిమా పని మీదే అక్కడకి వెళ్లినట్లు చెబుతున్నారు. 1920లలో సాగే పీరియాడిక్ డ్రామా నేపధ్యంలో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

1300 కోట్లతో బాక్సాఫీస్ క్వీన్ గా నిలిచిన హీరోయిన్ ఎవరు? 2025 లో టాప్ 5 స్టార్స్ కలెక్షన్లు
Demon Pavan Remuneration : 15 లక్షల జాక్ పాట్ తో పాటు, డిమాన్ పవన్ రెమ్యునరేషన్ టోటల్ గా ఎంతో తెలుసా?