Vijay Devarakonda: సిగరెట్ కోసం దేవరకొండని వాడేశాడు... స్టార్ హీరో రియాక్షన్ ఏంటంటే! 

Published : Jul 24, 2022, 06:10 PM IST
Vijay Devarakonda: సిగరెట్ కోసం దేవరకొండని వాడేశాడు... స్టార్ హీరో రియాక్షన్ ఏంటంటే! 

సారాంశం

విజయ్ దేవరకొండ ప్రమోషనల్ ఈవెంట్ లో చేసిన కామెంట్ పై మీమ్స్ రాయుళ్లు రెచ్చిపోతున్నారు. అంటే మీకు మా అయ్య తెల్వద్, మా తాత తెల్వద్ , ఎవ్వడూ తెల్వద్ అంటూ వరుస మీమ్స్ తో రెచ్చిపోతున్నారు. కాగా ఓ ఫన్నీ మీమ్ పై విజయ్ దేవరకొండ స్పందించాడు.

యాటిట్యూడ్ కి విజయ్ దేవరకొండ కేర్ ఆఫ్ అడ్రెస్. ఆ తరహా బిహేవియర్ తనకు ఇమేజ్ తెచ్చిపెట్టిందని ఆయన గట్టిగా నమ్ముతున్నాడు. దాంతో తనకే సొంతమైన ఆ ప్రవర్తన కొనసాగిస్తున్నాడు. విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ లైగర్(Liger). ఆగస్టు 25న విడుదల కానుంది. చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా జులై 21న ట్రైలర్ విడుదల చేశారు. ట్రైలర్ విడుదల కార్యక్రమంలో విజయ్ దేవరకొండ కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశాడు. 

అభిమానులను ఉద్దేశిస్తూ .. మీకు మా అయ్య తెల్వద్, మా తాత తెల్వద్, ఎవ్వడూ తెల్వద్.. అయినా మీరు నన్ను ఎంతగానో అభిమానిస్తున్నారని అన్నాడు. పరోక్షంగా ఈ కామెంట్స్ స్టార్ హీరోల వారసులను విమర్శించినట్లు ఉంది. టాలీవుడ్ స్టార్ హీరోలందరూ నేపోటిజం బాపతే. ఈ క్రమంలో విజయ్ దేవరకొండ కామెంట్స్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ కామెంట్స్ పై నిర్మాత బండ్ల గణేష్ స్పందించడం జరిగింది. బ్రదర్ ఇండస్ట్రీలో తాతలు, తండ్రులు ఉంటే సరిపోదు టాలెంట్ ఉండాలి అంటూ ఇండైరెక్ట్ గా పంచ్ విసిరాడు. 

ఇదిలా ఉంటే విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) కామెంట్ పై అనేక ఫన్నీ మీమ్స్, ట్రోల్స్ పుట్టుకొస్తున్నాయి. కాగా వాటిలో తనను బాగా ఆకర్షించిన ఓ మీమ్ పై విజయ్ దేవరకొండ స్పందించాడు. సదరు ట్వీట్ ట్యాగ్ చేస్తూ లాఫింగ్ ఇమోజి జోడించాడు. ఇక ఆ  మీమ్ వీడియోలో ఏముంది అంటే... ఓ కుర్రాడు టీ కొట్టు దగ్గరికి పోయి బాబాయ్ ఓ సిగరెట్ ఇవ్వు అంటాడు. దానికి టీ కొట్టు ఓనర్.. బాబు నువ్వు రోజూ మా కొట్టు దగ్గరే సిగరెట్ కొంటావు ఎందుకు అని అడుగగా.. దానికి ఆ కుర్రాడు ''అంటే మీకు మా అయ్య తెల్వద్, మా తాత తెల్వద్, ఎవ్వడూ తెల్వద్..'' అని చెబుతాడు. 

మా ఇంట్లో పెద్దోళ్ళు ఎవరూ నీకు తెలియదు కాబట్టి నేను సిగరెట్ తాగుతానన్న సీక్రెట్ లీక్ కాదు.. అని అర్థం వచ్చేలా ఆ మీమ్ రూపొందించగా విజయ్ దేవరకొండ పడి పడి నవ్వుతున్నారు. కాగా లైగర్ చిత్రాన్ని పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించాడు.  పాండే హీరోయిన్ గా నటించింది. ఈ మూవీలో విజయ్ ప్రొఫెషనల్ ఫైటర్ రోల్ చేశారు. 

PREV
click me!

Recommended Stories

2025 Box office దగ్గర సునామీ సృష్టించిన చిన్న సినిమాలు, తక్కువ బడ్జెట్ ఎక్కువ కలెక్షన్స్
Mahesh Babu పిల్లలు కింద పడి మరీ నవ్విన వెంకటేష్ సినిమా? ఆ డైరెక్టర్ కు వెంటనే ఛాన్స్ ఇచ్చిన సూపర్ స్టార్