NTR about Suma: యాంకర్‌ సుమపై నోరు పారేసుకున్న ఎన్టీఆర్‌.. ఇంత కసి మనసులో దాచుకున్నాడా?

Published : Mar 21, 2022, 06:58 AM IST
NTR about Suma: యాంకర్‌ సుమపై నోరు పారేసుకున్న ఎన్టీఆర్‌.. ఇంత కసి మనసులో దాచుకున్నాడా?

సారాంశం

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ మరోసారి తన ఓపెన్‌ మైండ్‌ని చాటుకున్నారు. యాంకర్‌ సుమపై తన అభిప్రాయాన్ని కీరవాణికి ఓపెన్‌గా చెప్పాడు. కానీ ఆయన విషయాలు ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అవుతున్నాయి. 

ఎన్టీఆర్‌(Ntr) అంటే బోల్డ్. భోళాశంకర్‌ లాంటివాడు. ఏదీ మనసులో పెట్టుకోడు. మనసులో ఉన్నది ఉన్నట్టు బయటకు చెప్పేస్తాడు. చిన్న పిల్లాడి మనస్థత్వం, ఆయన ప్రేమని తట్టుకోవడం చాలా కష్టం అని రాజమౌళి పదే పదే చెప్పారు. `ఆర్‌ఆర్‌ఆర్‌`(RRR Movie) ప్రమోషన్‌లో ఈ విషయాన్ని స్పష్టం చేశాడు రాజమౌళి. అది నిజమే అనే విషయాన్ని ఎన్టీఆర్‌ కూడా చాలా సార్లు నిరూపించుకున్నారు. తాజాగా మరోసారి తన ఓపెన్‌ మైండ్‌ని చాటుకున్నారు. అయితే స్టార్‌ యాంకర్‌ సుమ(Anchor Suma)పై తన అభిప్రాయాన్ని ఓపెన్‌గా చెప్పాడు. కానీ ఆయన విషయాలు ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అవుతున్నాయి. 

ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌(Ram Charan) కలిసి `ఆర్‌ఆర్ఆర్‌` చిత్రంలో నటించారు. రాజమౌళి రూపొందించిన ఈ సినిమా మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ చిత్ర ప్రమోషన్‌లో బిజీగా ఉంది యూనిట్‌. బ్యాక్‌ టూ బ్యాక్‌ ఇండియాలోని ప్రధాన నగరాలను కవర్‌ చేసే పనిలో ఉన్నారు. అదే సమయంలో టీమ్‌ ఇంటర్వ్యూలు, చిట్‌చాట్‌లోనూ పాల్గొన్నారు. ఒక్కొక్కటి విడుదల చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. ఆడియెన్స్ ని తన సినిమాపై ఎంగేజ్‌ చేస్తున్నారు. 

అందులో భాగంగా తాజాగా చిత్ర సంగీత దర్శకుడు కీరవాణితో కలిసి చిట్‌చాట్‌ చేశారు. ఇందులో చరణ్‌, తారక్‌లను కీరవాణి ఇంటర్వ్యూ చేశారు. ఇందులో కీరవాణి కంపోజ్‌ చేసిన పాటల్లో తనకు `భీమవరం బుల్లోడా `పాట తనకు అస్సలు నచ్చదని చెప్పాడు తారక్‌. తనకు ఇష్టమైన సింగర్‌ మోహన భోగరాజు, గీతా మాధురి ల పేర్లు చెప్పారు. వారి వాయిస్‌ బాగుంటుందన్నారు. ఇంతలో యాంకర్‌ సుమ గురించి చెప్పాలని, ఆమెకి మీ సినిమాల్లో ఎలాంటి పాత్ర ఇస్తారని కీరవాణి ప్రశ్నించాడు. 

దీంతో ఎన్టీఆర్‌ స్పందించారు. సుమపై నోరు పారేసుకున్నాడు. ఆమె గయ్యాలి  అని, నోరుపారేసుకుంటుందని, ఆమెని చూస్తే గయ్యాలి అత్త పాత్రలు గుర్తొస్తాయని, ఆయా పాత్రలు ఆమెకి బాగా సెట్‌ అవుతుందన్నారు. అంతేకాదు నాయనమ్మ, అమ్మమ్మ లాంటి ముసలమ్మ పాత్రలివ్వాలన్నాడు. అంతటితోనూ ఆగలేదు ఎన్టీఆర్‌, సుమకి చాదస్తం ఎక్కువని, ఎక్కువగా వాగుతుందని చెప్పారు. రామ్‌చరణ్‌ సైతం స్పందించారు. సుమకి పంజాయితీలు పరిష్కరించే మధ్యవర్తి పాత్రని ఇవ్వాలన్నాడు. 

అయితే సరదాగా సాగిన చిట్‌చాట్‌లో ఎన్టీఆర్‌ ఫన్నీ వేలో ఈ విషయాలు చెప్పారు. కాసేపు నవ్వించడం కోసం ఇలా ఆమెపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం సుమ నటిగా రీఎంట్రీ ఇస్తూ `జయమ్మ పంచాయితీ` చిత్రంలో నటిస్తుంది. దీనికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇదిలా ఉంటే సుమ భర్త, నటుడు రాజీవ్‌ కనకాల, ఎన్టీఆర్‌ ఇద్దరు మంచి స్నేహితులనే విషయం తెలిసిందే. మరోవైపు `ఆర్‌ఆర్‌ఆర్‌` కోసం తారక్‌, చరణ్‌ అభిమానులే కాదు, సాధారణ ఆడియెన్స్ కూడా వెయిట్‌ చేస్తుండటం విశేషం. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Ashika Ranganath: దాదాపు 30 ఏళ్ళ వయసు తేడా ఉన్న ముగ్గురు హీరోలతో రొమాన్స్.. హీరోయిన్ రియాక్షన్ వైరల్
చివరి నిమిషంలో ప్లేట్ తిప్పేశారు, ఇమ్మాన్యుయేల్ కి మొండి చేయి.. బిగ్ బాస్ పై దుమ్మెత్తి పోస్తున్న రోహిణి