Bigg boss Nonstop:అనూహ్యంగా హౌస్ నుండి ఆర్జే చైతూ అవుట్!

Sambi Reddy   | others
Published : Mar 20, 2022, 09:25 PM IST
Bigg boss Nonstop:అనూహ్యంగా హౌస్ నుండి ఆర్జే చైతూ అవుట్!

సారాంశం

బిగ్ బాస్ నాన్ స్టాప్(Biggboss Nonstop) ముచ్చటగా మూడు వారాలు పూర్తి చేసుకుంది. ఆదివారం హౌస్ నుండి ఓ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యారు. రెడ్ ఎఫ్ఎం ఆర్జే చైతూ ఈ వారం హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యాడు.   


మొత్తం 17 మంది కంటెస్టెంట్స్ తో మొదలైన బిగ్ బాస్ నాన్ స్టాప్ మూడు వారాలు పూర్తి చేసుకుంది. ప్రతి ఆదివారం ఒకరు ఎలిమినేట్ కావాల్సి ఉండగా ఈ వారం ఆర్జే చైతూ హౌస్ ని వీడారు. ఈ వారం మొత్తం పన్నెండు మంది కంటెస్టెంట్స్ ఎలిమినేషన్ కి నామినేట్ అయ్యారు. షో చివరి నిమిషం వరకు ఎవరు ఎలిమినేట్ అవుతారనే ఉత్కంఠ కొనసాగింది. ఇక అందరికంటే అతి తక్కువ ఓట్లు తెచ్చుకున్న ఆర్జే చైతు ఇంటి నుండి బయటికి వచ్చేశారు. 

తన ఎలిమినేషన్ పై ఆర్జే చైతూ (RJ Chaitu)చాలా విచారం వ్యక్తం చేశారు. తన జర్నీ ఇంత షార్ట్ గా ముగుస్తుందని ఊహించలేదన్నారు. ఆర్జే చైతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇక తన హౌస్ మేట్స్ కి సలహాలు ఇచ్చిన ఆర్జే చైతూ.. తనకు కెప్టెన్సీ ద్వారా దక్కిన బ్యాడ్జ్ అనిల్ రాథోడ్ కి ఇచ్చాడు. అలా ఈ వారం ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగింది. 

ఇక మొదటి వారం ముమైత్ ఖాన్ ఎలిమినేట్ అయ్యారు. అనంతరం వర్మ తెరకెక్కించిన నగ్నం ఫేమ్ హీరోయిన్ శ్రీరాపాక ఎలిమినేట్ కావడం జరిగింది. ఆర్జే చైతూ ఎలిమినేషన్ తో మొత్తం ముగ్గురు కంటెస్టెంట్ హౌస్ ని వీడారు. దీంతో హౌస్ లో 14 మంది కంటెస్టెంట్స్ ఉన్నట్లు అయ్యింది. వీరి నుండి ఒక కంటెస్టెంట్ వచ్చే వారం ఎలిమినేట్ కానున్నారు. ఇక బిగ్ బాస్ నాన్ స్టాప్ కి అనుకున్నంత ఆదరణ దక్కడం లేదన్నట్లు సమాచారం. ఈ ఓటీటీ బిగ్ బాస్ షో ప్రేక్షకులను అంతగా ఆకర్షించడం లేదు. 
 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 : తనూజ తో ఐటమ్ సాంగ్ చేయిస్తానన్న ఇమ్మాన్యుయేల్, అడ్డంగా బుక్కైన డీమాన్ పవన్.. హౌస్ లో చివరి రోజు సందడి
Emmanuel Remuneration: ఇమ్మూ రెమ్యూనరేషన్‌ మైండ్‌ బ్లోయింగ్‌.. బిగ్‌ బాస్‌ తెలుగు 9 షోకి ఎంత తీసుకున్నాడంటే?