జై లవ కుశ ఫస్ట్ లుక్ డేట్ ఫిక్స్

Published : May 10, 2017, 10:28 AM ISTUpdated : Mar 26, 2018, 12:03 AM IST
జై లవ కుశ ఫస్ట్ లుక్ డేట్ ఫిక్స్

సారాంశం

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా జై లవ కుశ కళ్యాణ్ రామ్ నిర్మాతగా తెరకెక్కుతున్న జై లవకుశ త్వరలోనే  ఫస్ట్ లుక్ రిలీజ్ చేసేందుకు ప్లాన్స్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజా చిత్రంగా బాబీ దర్శకత్వంలో 'జై లవ కుశ' చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేయనున్నట్టుగా వార్తలు వచ్చిన దగ్గర నుంచి, ఈ సినిమా ఫస్టులుక్ కోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నెల 20వ తేదీన ఎన్టీఆర్ పుట్టిన రోజు కావడంతో, ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ నెల 19న ఫస్టులుక్ ను రిలీజ్ చేస్తున్నారు.

ఎన్టీఆర్ మూడు గెటప్స్ ను మిక్స్ చేస్తూ బాబీ ఈ ఫస్టులుక్ ను స్పెషల్ గా డిజైన్ చేయించినట్టు చెబుతున్నారు. టైటిల్ లోగోను ఆవిష్కరించినప్పుడు అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. అంతకి మించి అన్నట్టుగా ఫస్టు లుక్ వుండేలా చూస్తున్నారు. ఫస్టులుక్ ఏ రేంజ్ లో మెప్పిస్తుందో చూడాలి.   

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రీతూ కాదు, తనూజ వెంటపడేవాడిని.. షాకిచ్చిన డీమాన్‌ పవన్‌.. బిగ్‌ బాస్‌ ఎమోషనల్‌ జర్నీ
ఈ హీరోయిన్ నటించిన 4 సినిమాలు డిజాస్టర్లు.. కానీ పేరేమో మరో సావిత్రి