
ప్రేక్షకుల అంచనాలకు మించి అందించడం దర్శకుడు రాజమౌళికే సాధ్యం. నిరాశపరచడం ఆయన డిక్షనరీలోనే లేదు. మరోమారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంచనాలకు మించి పోయేలా వారికి ట్రీట్ ఇచ్చాడు ఆయన. ఎన్టీఆర్ 38వ బర్త్ డే ను పురస్కరించుకొని కొమరం భీమ్ గా ఎన్టీఆర్ లుక్ విడుదల చేశారు. వాయు వేగంతో యుద్ధ భూమిలో అడుగుపెడుతున్న కొమరం భీమ్ గా ఎన్టీఆర్ ఇంటెన్స్ లుక్ గూస్ బంప్స్ కలిగించేదిగా ఉంది.
పంచ కట్టు, నుదుట బొట్టు పెట్టిన ఎన్టీఆర్.. బల్లెం తో విరుచుకుపడుతున్నారు. బెల్లం కంటే కూడా కోపాగ్నితో రగిలిపోతున్న ఎన్టీఆర్ చూపులే పదునుగా ఉన్నాయి. కొమరం భీమ్ గా ఎన్టీఆర్ లుక్ ఫ్యాన్స్ కి పర్ఫెక్ట్ బర్త్ డే ట్రీట్ లా ఉంది. ఇక ఎన్టీఆర్ కొమరం భీమ్ లుక్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.
పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఆర్ ఆర్ ఆర్ లో మరో హీరోగా రామ్ చరణ్ నటిస్తున్నారు. అలియా భట్ హీరోయిన్ గా నటిస్తుండగా, అజయ్ దేవ్ గణ్ కీలక రోల్ చేస్తున్నారు. కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ కి బ్రేక్ పడింది. అక్టోబర్ 13 ఆర్ ఆర్ ఆర్ విడుదల తేదీగా ప్రకటించిన విషయం తెలిసిందే.
ఎన్టీఆర్ విన్నపం మేరకు భౌతిక వేడుకలకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ దూరంగా ఉన్నారు. అయితే సోషల్ మీడియాలో మాత్రం భారీగా సందడి చేస్తున్నారు. ఎన్టీఆర్ బర్త్ డే యాష్ ట్యాగ్ ఇండియా వైడ్ టాప్ లో ట్రెండ్ చేస్తున్నారు. ఇక చిత్ర ప్రముఖులు సైతం ఎన్టీఆర్ కి సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెష్ తెలియజేస్తున్నారు.