బయోపిక్ అంటే మంచి చేడు రెండు చూపించాలని అంటుంటారు. నెగిటివ్ అంశాలు ఎన్ని ఉన్నా కూడా ఎదో ఒక కోణంలో ఎందుకు అలా చేయాల్సి వచ్చింది అనే అంశాలను కూడా చూపించాలి. అయితే ఇప్పుడు తెరకెక్కుతున్న బయోపిక్ లను చూస్తుంటే కేవలం అది కొంత మందికి మాత్రమే వర్తిస్తుందా అనే ఆలోచన రాకుండా ఉండదు.
ఎన్టీఆర్ సినీ జీవితంలో పాజిటివ్ అంశాలతో పాటు చాలా కాంట్రవర్సీలు ఉన్నాయని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ప్రతి మనిషిలో విభిన్న కోణాలు ఉంటాయి. అయితే ఎన్టీఆర్ మాత్రం ఫైనల్ గా ఒక రాజకీయ నాయకుడిగా జనాల్లో మంచి నేతగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అసలు విషయంలోకి వస్తే సినిమాలో సూపర్ స్టార్ కృష్ణను పెద్దగా టచ్ చేయలేదు. క్రిష్ స్క్రీన్ ప్లేతో సేఫ్ గేమ్ ఆడినట్లు తెలుస్తోంది.
వారి జనరేషన్ తో పోటీ పడిన శోభన్ బాబును కూడా బయోపిక్ లో కనిపించలేదు. కేవలం ఏఎన్నార్ ని మాత్రమే ఎన్టీఆర్ కు ఎక్కువగా సన్నిహితంగా ఉన్నట్లు చూపారు. నెగిటివ్ అంశాలను చూపిస్తే అదొక తలనొప్పి అని సైలెంట్ గా ఉన్నారు. అది మంచి అంశమే అయినా మ్యాటర్ మిస్ చేస్తే బయోపిక్ అనే దానికి అర్ధం ఉండదు. ఎన్టీఆర్ తో కృష్ణకు విభేదాలు తార స్థాయిలో ఉండడం అప్పట్లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేశాయి.
undefined
మొదట్లో ఎన్టీఆర్ కృష్ణతో సినిమాలు చేశారు. అలాగే ఆయన సినిమాల సక్సెస్ ఈవెంట్స్ కు కూడా వెళుతుండేవారు. కానీ మధ్యలో అల్లూరి సీతారామరాజు సినిమా విషయంలో విభేదాలు మరింత ముదిరాయి. అంతే కాకుండా రాజకీయ పరంగా కూడా ఎన్టీఆర్ కృష్ణ దూరంగా ఉండేవారు. ఇకపోతే సంపూర్ణ రామాయణం సినిమా చేసిన శోభన్ బాబుకు ఆ సినిమా చేస్తే వర్కౌట్ అవ్వదని సలహా ఇచ్చారు.
ఎన్టీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారని కూడా ఒక టాక్ ఉంది. ఎన్ని వివాదాలున్నా క్రిష్ వాటి జోలికి కొంచెం కూడా వెళ్ళలేదు. కేవలం పాజిటివ్ అంశాలతో ముందుకు సాగారు. ఇక మహానాయకుడు విషయంలో మాత్రం విలన్స్ లేనిదే ఎన్టీఆర్ ను ఎలివేట్ చేయడం చాలా కష్టం. కథానాయకుడు లో ఎమోషన్స్ బాగానే వర్కౌట్ చేశారు. దీంతో సెకండ్ పార్ట్ పై మరింత ఆసక్తి నెలకొంది.