సతీమణికి ఎన్టీఆర్‌ భారీ కానుక.. షాక్‌లో ప్రణతి..

Published : Mar 22, 2021, 01:28 PM ISTUpdated : Mar 22, 2021, 01:30 PM IST
సతీమణికి ఎన్టీఆర్‌ భారీ కానుక.. షాక్‌లో ప్రణతి..

సారాంశం

ఎన్టీఆర్‌ తన భార్య లక్ష్మీ ప్రణతికి భారీ కానుక ఇచ్చాడు. ఆమె బర్త్ డే సందర్భంగా ఊహించని గిఫ్ట్ ఇచ్చి ఆశ్చర్యపరిచాడు ఎన్టీఆర్‌. ఈ నెల 18న లక్ష్మీ ప్రణతి పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ భార్య ప్రణతికి సీటీలో ఉన్న ఓ పెద్ద ఫామ్‌ హౌజ్‌ని ఆమె పేరిట రాయించాడు. 

ఎన్టీఆర్‌ తన భార్య లక్ష్మీ ప్రణతికి భారీ కానుక ఇచ్చాడు. ఆమె బర్త్ డే సందర్భంగా ఊహించని గిఫ్ట్ ఇచ్చి ఆశ్చర్యపరిచాడు ఎన్టీఆర్‌. ఈ నెల 18న లక్ష్మీ ప్రణతి పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ భార్య ప్రణతికి సీటీలో ఉన్న ఓ పెద్ద ఫామ్‌ హౌజ్‌ని ఆమె పేరిట రాయించాడు.  అంతేకాదు ఆమె బర్త్ డే సెలబ్రేషన్స్ కూడా అదే ఫామ్‌ హౌజ్‌లో నిర్వహించినట్టు తెలుస్తుంది. దీంతో ప్రణతి ఉబ్బితబ్బిబ్బయ్యిందట. ఊహించని గిఫ్ట్ కి ప్రణతి ఆనందానికి అవదుల్లేవని చెప్పొచ్చు. 

ఎన్టీఆర్‌ 2011 మే 5న ప్రణతిని వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు అభయ్‌రామ్‌, భార్గవ్‌ రామ్‌లు జన్మించారు. ఇదిలా ఉంటే ఆదివారం ఆయన `తెల్లవారితే గురువారం` చిత్ర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో పాల్గొన్నాడు. అందులో అభిమానులు స్టేజ్‌పైకి దూసుకొచ్చి ఉక్కిరి బిక్కిరి చేశారు. మరికొందరు సీఎం అంటూ నినాదాలు చేశారు. దీనిపై ఆయన సీరియస్‌గా స్పందించారు. మరోవైపు ఎన్టీఆర్‌ ప్రస్తుతం `ఆర్‌ఆర్‌ఆర్‌`లో నటిస్తున్నారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

ప్రభాస్ స్పిరిట్ నుంచి ప్రకాశ్ రాజ్‌ను తీసేశారా? అసలేం జరిగిందంటే..
సినిమా కోసం ఏడాది వయసున్న తన కూతురితో వీడియో చేసిన చిరు.. ఎన్టీఆర్ తర్వాత నువ్వే, జోస్యం చెప్పిన డైరెక్టర్