యష్, ప్రభాస్ కాదు... ప్రశాంత్ నీల్ ఫేవరేట్ హీరో ఎవరంటే?

By Sambi Reddy  |  First Published Feb 11, 2024, 2:24 PM IST


ప్రశాంత్ నీల్ దేశం మెచ్చిన దర్శకుల్లో ఒకరు. కేవలం నాలుగు సినిమాలతో ఆయన రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఆయనతో సినిమా చేసేందుకు స్టార్స్ ఎగబడుతున్నారు. అయితే ప్రశాంత్ నీల్ ఫేవరేట్ హీరో ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు. 
 


భారతదేశంలోని బడా దర్శకుల్లో ప్రశాంత్ నీల్ ఒకరు. కెజిఎఫ్ మూవీతో ఆయన నేమ్ పలు చిత్ర పరిశ్రమలకు పాకింది. కెజిఎఫ్ కి కొనసాగింపుగా వచ్చిన కెజిఎఫ్ 2 ఇండియన్ బాక్సాఫీస్ షేక్ చేసింది. వరల్డ్ వైడ్ రూ. 1200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ప్రశాంత్ నీల్ కన్నడ పరిశ్రమకు మాత్రమే తెలిసిన యష్ ని పాన్ ఇండియా స్టార్ చేశాడు. కెజిఎఫ్ సిరీస్ తో యష్ రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఆయన వంద కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకునే హీరో అయ్యాడు. 

ప్రభాస్ తో ప్రశాంత్ నీల్ మరో పాన్ ఇండియా హిట్ కొట్టాడు. వీరి కాంబోలో వచ్చిన సలార్ వరల్డ్ వైడ్ రూ. 700 కోట్ల వసూళ్లు దాటింది. సలార్ మూవీలో ప్రభాస్ మాస్ అవతార్ ఫ్యాన్స్ ని ఫిదా చేస్తుంది. ప్రభాస్ ఇమేజ్ కి పర్ఫెక్ట్ గా సలార్ సెట్ అయ్యింది. సలార్ కి కొనసాగింపుగా సలార్ 2 రానుంది. ప్రస్తుతం సలార్ 2 స్క్రిప్ట్ పనుల్లో ప్రశాంత్ నీల్ బిజీగా ఉన్నట్లు సమాచారం. 

Latest Videos

కాగా ప్రశాంత్ నీల్ యశ్, ప్రభాస్ లకు భారీ హిట్స్ ఇచ్చాడు. అయితే ఆయన ఫేవరేట్ హీరో వీరిద్దరిలో ఎవరూ కాదట. ప్రశాంత్ నీల్ కి ఇష్టమైన హీరో ఎన్టీఆర్ అట. ఈ విషయాన్ని ఆయన గతంలో పలు సందర్భాల్లో వివరించారు. అందుకే ఎన్టీఆర్ కోసం ప్రత్యేకంగా కథ సిద్ధం చేశాడు. ఎన్టీఆర్ తో చేసేది ప్రశాంత్ నీల్ డ్రీమ్ ప్రాజెక్ట్ అట. 

సలార్ కి ముందే ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ మూవీ ప్రకటించారు. ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్న నేపథ్యంలో సలార్ కి కమిట్ అయ్యాడు. మరోవైపు ఎన్టీఆర్ దేవర తెరపైకి తెచ్చారు. ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర, వార్ 2 చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ రెండు ప్రాజెక్ట్స్ అనంతరం ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబోలో మూవీ తెరకెక్కనుంది. 


 

click me!