ప్రియా వారియర్ నన్ను దెబ్బకొట్టింది.. నటి కామెంట్స్!

By Udaya DFirst Published 21, Feb 2019, 4:20 PM IST
Highlights

ప్రియా ప్రకాష్ వారియర్ ఒక్క వీడియోతో సెన్సేషనల్ అయిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఆమెకి అభిమానులు ఏర్పడ్డారు. ఆమె నటించిన 'లవర్స్ డే' సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

ప్రియా ప్రకాష్ వారియర్ ఒక్క వీడియోతో సెన్సేషనల్ అయిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఆమెకి అభిమానులు ఏర్పడ్డారు. ఆమె నటించిన 'లవర్స్ డే' సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో ప్రియాతో పాటు రోషన్ అబ్దుల్, నూరిన్ షరీఫ్ ప్రధాన పాత్రల్లో కనిపించారు.

సినిమాలో రెండో హీరోయిన్ గా కనిపించిన నూరిన్.. ప్రియా ప్రకాష్ ని ఉద్దేశిస్తూ చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. నిజానికి ముందుగా సినిమాలో లీడ్ క్యారెక్టర్ గా నూరిన్ ని అనుకున్నారట. కథ మొత్తం ఆమె చుట్టూ తిరిగేలా స్క్రిప్ట్ కూడా రాసుకున్నారట.

కానీ ఎప్పుడైతే ప్రియా ప్రకాష్ సెన్సేషనల్ అయిందో.. కథ మొత్తం మార్చేసి.. ప్రియా పాత్రకు ప్రాధాన్యతనిస్తూ నూరిన్ రోల్ తగ్గించేశారట. ఈ విషయంపై ఆమె మీడియాతో మాట్లాడింది. ప్రియా వారియర్ సెన్సేషనల్ గా మారిన తరువాత తనను పక్కన పెట్టారని వాపోయింది.

ఆ కారణంగా ఎంతో ఆవేదనకు గురైనట్లు చెప్పింది. ఇకపై ప్రియా వారియర్ తో కలిసి నటించే అవకాశం వస్తే ఒకటికి పదిసార్లు ఆలోచిస్తానని, నటించకుండా ఉండడానికే ప్రయత్నిస్తానని అంతగా ఆమె తన కెరీర్ ని గందరగోళంలో పడేసిందని వాపోయింది. 
 

Last Updated 21, Feb 2019, 4:20 PM IST