Latest Videos

“కల్కి 2898 ఎడి” లాస్ట్ మినిట్ ట్విస్ట్, గోలెత్తిపోతున్న ఫ్యాన్స్

By Surya PrakashFirst Published Jun 21, 2024, 9:36 AM IST
Highlights

అయితే ఇప్పుడు అవన్నీ రూమర్స్ అని తేలిపోయింది. దాంతో తెలుగు అభిమానులు ఇలా చేస్తున్నారేంటి సామీ అని వైజయింతి బ్యానర్ ని అడుగుతున్నారు. 


 కల్కి సినిమా కోసం ప్రపంచ వ్యాప్తంగా ప్రభాస్  అభిమానులు మాత్రమే కాకుండా కామన్ ఆడియన్స్ సైతం  ఎంతగానో ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో, భారీ కాస్ట్ తో హాలీవుడ్ రేంజ్ లో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కల్కి 2898AD సినిమా జూన్ 27న రిలీజ్ కాబోతోంది. ఈ మేరకు ప్రమోషన్స్  భారీగా ఉంటాయనుకుంటే యావరేజ్ గా కూడా లేవు. ప్రభాస్ కటౌట్ కు, సినిమా బడ్జెట్ కు తగ్గట్లు ప్రమోషన్స్ లేవు. ఇలా ఎందుకు చేస్తున్నారనేది అందరికీ ఊహకు అందని ప్రశ్నగానే మిగిలింది. ఇప్పటికే కల్కి సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్, పోస్టర్స్, స్క్రాచ్ వీడియోలు, ట్రైలర్, అమేజాన్ లో వదిలిన వీడియోలు వదిలారు.

 ప్రభాస్ సినిమాకు రెగ్యులర్ గా ఉండే బజ్ తప్పిచి సినిమాపై అయితే ప్రత్యేకమైన బజ్ క్రియేట్ చేయలేకపోయారు. ఈ నేపధ్యంలో తెలుగు అభిమానులు ప్రీ రిలీజ్ ఈవెంట్ అయినా ఘనంగా చేస్తారు అని ఆశలు పెట్టుకున్నారు. అమరావతిలో ప్రీ రిలీజ్ ఈవెంట్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గెస్ట్ లు అని ఆశపడ్డారు. అయితే ఇప్పుడు అవన్నీ రూమర్స్ అని తేలిపోయింది. దాంతో తెలుగు అభిమానులు ఇలా చేస్తున్నారేంటి సామీ అని వైజయింతి బ్యానర్ ని అడుగుతున్నారు. 
 
 మొదటగా  ప్రీ రిలీజ్  ఏపీలో భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారని టాక్ వచ్చింది. కానీ అది కాస్తా క్యాన్సిల్ అయ్యింది. దీనితో హైదరాబాద్ లో చేస్తారని బజ్ వచ్చింది కానీ ఇది కూడా లేదని ఇప్పుడు   వినిపిస్తోంది. దీనితో ఇప్పుడు తెలుగు ఆడియెన్స్ కి ప్రీ రిలీజ్ ఈవెంట్ లేనట్టే . ఇది అభిమానులకి డిజప్పాయింట్ చేసే వార్తే . మరి దీనిపై అధికారిక క్లారిటీ ఏమన్నా వస్తుందేమో చూడాలి.
 
  కల్కి సినిమాలో ప్రభాస్, అమితాబ్, కమల్ హాసన్, దీపికా పదుకోన్, దిశా పటాని నటిస్తుండగా వారితో పాటు మరికొంతమంది స్టార్ కాస్ట్ నటిస్తున్నారని సమాచారం. ఏకంగా 400 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాతో పాన్ వరల్డ్ పై కన్నేశాడు ప్రభాస్.
 

click me!