అయ్యో.. రవితేజ సినిమాకి బయ్యర్లు లేరే..!

Published : Nov 03, 2018, 09:53 AM IST
అయ్యో.. రవితేజ సినిమాకి బయ్యర్లు లేరే..!

సారాంశం

ఒకప్పుడు వరుస విజయాలు అందుకున్న హీరో రవితేజ పరిస్థితి ఇప్పుడు బాగా డీలా పడింది. మాస్ లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న హీరోల్లో ఒకరైన రవితేజ సినిమాలను కొనడానికి ఇప్పుడు బయ్యర్లు లేకుండా పోయారు. పరాజయాలు ఎంతటి స్టార్ హీరోనైనా ఇబ్బందుల్లో నెట్టేస్తాయనే దానికి రవితేజ ఉదాహరణ. 

ఒకప్పుడు వరుస విజయాలు అందుకున్న హీరో రవితేజ పరిస్థితి ఇప్పుడు బాగా డీలా పడింది. మాస్ లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న హీరోల్లో ఒకరైన రవితేజ సినిమాలను కొనడానికి ఇప్పుడు బయ్యర్లు లేకుండా పోయారు. 

పరాజయాలు ఎంతటి స్టార్ హీరోనైనా ఇబ్బందుల్లో నెట్టేస్తాయనే దానికి రవితేజ ఉదాహరణ. వివరాల్లోకి వెళితే రవితేజ హీరోగా దర్శకుడు శ్రీనువైట్ల 'అమర్ అక్బర్ ఆంటోనీ' సినిమా రూపొందించాడు.

అటు శ్రీనువైట్లకి వరుస ఫ్లాప్ లు ఉండడం, మరోపక్క రవితేజకి వరుసగా రెండు పెద్ద డిజాస్టర్ లు ఈ ఏడాదిలోనే రావడంతో వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా కొనడానికి బయ్యర్లు ఆసక్తి చూపడం లేదు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ ని చూసి కొందామని అనుకున్నప్పటికీ బయ్యర్లు మాత్రం ఈ కాంబినేషన్ లో సినిమా అంటే జంకుతున్నారు.

లోకల్ బయ్యర్ల పరిస్థితే ఇలా ఉందంటే.. ఇక ఓవర్సీస్ లో ఈ సినిమాని కొనడానికి ఒక్కరు కూడా ముందుకు రాకపోవడం గమనార్హం. ఒకప్పుడు శ్రీనువైట్ల సినిమాలకి ఓవర్సీస్ లో మార్కెట్ ఓ రేంజ్ లో జరిగేది. కానీ ఇప్పుడు ఆయన సినిమాను కొనే పరిస్థితి లేకుండా పోయింది. మరి నిర్మాతలు ప్రీరిలీజ్ బిజినెస్ లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో చూడాలి!

PREV
click me!

Recommended Stories

Brahmamudi Serial Today Episode: సొంత ఇంటికే కన్నం వేసిన ఐశ్వర్య, దొంగలను చితక్కొట్టిన ఇందు, నందు
Karthika Deepam 2 Today Episode:దీప భయం-మెంటల్ షాక్‍లో సుమిత్ర-దశరథ కంగారు-జ్యోకు కార్తీక్ వార్నింగ్