ఆహారంలో బొద్దింక, స్విగ్గీపై మండిపడ్డ నివేదా

Surya Prakash   | Asianet News
Published : Jun 24, 2021, 08:54 AM ISTUpdated : Jun 24, 2021, 09:00 AM IST
ఆహారంలో బొద్దింక, స్విగ్గీపై మండిపడ్డ నివేదా

సారాంశం

మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా,  అల వైకుంఠ‌పురంలో న‌టించి మెప్పించింది. ఇక ఆ త‌ర్వాత కూడా రామ్‌తో రెడ్ లో జోడీ క‌ట్టింది. ప్రస్తుతం విశ్వక్ సేన్ సరసన పాగల్ సినిమా చేస్తోంది. 

ప్రస్తుతం నడుస్తోంది ఆన్‌లైన్‌ యుగం. దానికి తోడు లాక్ డౌన్ ,,కరోనా తో బయిటకు వెల్లలేని సిట్యువేషన్. దాంతో ఇల్లు దాటకుండా.. కాలు కదపకుండా నచ్చిన వస్తువులను, ఆహారాన్ని మనం ఉన్న చోటకే తెప్పించుకోగలుతున్నాం. ఇందుకు గాను స్విగ్గి,జొమోటో వంటి యాప్ లు ఆశ్రయిస్తున్నాం.  ఆయా సంస్థలు ప్రత్యేకంగా డెలివరీ బాయ్‌లను నియమించుకుంటారు. వీరు మన ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేసే వాటిని మనం ఉన్న చోటకు తీసుకొచ్చి అందజేస్తారు. అయితే ఈ డెలవరీపై రకరకాల కంప్లైంట్స్ వస్తున్నాయి.  సెలబ్రెటీలు వాటిని సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి తెస్తున్నారు.

నటి నివేదా పేతురాజ్‌ తన ఫుడ్ లో ఓ బొద్దింక కనపడటంతో షాక్ అయ్యింది. ఆమె ఆన్ లైన్ లో ఫుడ్ డెలవరీ యాప్ స్విగ్గీ లో ఫుడ్ ఆర్డర్ చేస్తే ఈ బొద్దింక వచ్చిందని ట్విట్టర్ ద్వారా తెలియచేసారు. దాంతో వాళ్ళకు సంభందించిన రెస్టారెంట్స్  ఏం స్టాండర్డ్స్ ఫాలో అవుతున్నారో తెలియటం  లేదంటూ కోప్పడింది. నేను రెండు సార్లు నా ఫుడ్ లో బొద్దింక రావటం గమనించాను అంది. ఇలాంటి రెస్టారెంట్స్ ని గమనించి స్టాండర్డ్స్ సరిగ్గా లేనివాటికి ఫైన్ వేయాలని ట్విట్టర్ ద్వారా కోరింది. 

ఈ ట్వీట్ కు స్విగ్గి కూడా స్పందించింది. మేము క్వాలిటీ విషయంలో రాజీ పడమని చెప్తూ..ఆర్డర్ ఐడి చెప్తే అది ఏ రెస్టారెంట్ నుంచి వచ్చిందో పరిశీలించి చర్య తీసుకుంటామని చెప్పింది. 

 తెలుగు, త‌మిళ సినిమాల్లో మంచి క్రేజ్ ఉన్న యాక్ట‌ర్ నివేదా పేతురాజ్‌. చాలా సినిమాల్లో హీరోయిన్ గా ట్రై చేసినా.. పెద్ద‌గా క‌లిసిరాలేదు. దీంతో మంచి క్యారెక్ట‌ర్లు చేస్తూ పేరు తెచ్చుకుంటోంది. దొరికిన మేరకు సెకండ్ హీరోయిన్ గా పెద్ద హీరోల సినిమాల్లో చేస్తూ.. ఫుల్ బిజీగా ఉంటోంది. ఇప్ప‌టికే మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా,  అల వైకుంఠ‌పురంలో న‌టించి మెప్పించింది. ఇక ఆ త‌ర్వాత కూడా రామ్‌తో రెడ్ లో జోడీ క‌ట్టింది. ప్రస్తుతం విశ్వక్ సేన్ సరసన పాగల్ సినిమా చేస్తోంది. 

PREV
click me!

Recommended Stories

Sobhan Babu `సోగ్గాడు` మూవీతో పోటీ పడి దెబ్బతిన్న ఎన్టీఆర్‌.. శివాజీ గణేషన్‌కైతే చుక్కలే
Illu Illalu Pillalu Today: వల్లి పెట్టిన చిచ్చు, ఘోరంగా మోసపోయిన సాగర్, భర్త చెంప పగలకొట్టిన నర్మద