చిరంజీవి చిత్రంలో ఛాన్స్.. సెకండ్‌ హీరోయిన్‌గానే సెటిల్ అవుతున్న నివేతా పేతురాజ్‌?

By Aithagoni Raju  |  First Published Mar 21, 2022, 7:40 AM IST

హీరోయిన్‌ నివేతా పేతురాజ్‌ సెకండ్‌ హీరోయిన్‌గానేసెటిల్‌ అవుతుందా? ఆమెకి వరుసగా సెకండ్‌ హీరోయిన్‌ పాత్రలు రావడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. తాజాగా చిరంజీవి చిత్రంలోనూ అలాంటి పాత్రే రావడం గమనార్హం.


`మెంటల్‌ మదిలో` చిత్రంతో తెలుగు ఆడియెన్స్ ని పలకరించింది తమిళ బ్యూటీ నివేతా పేతురాజ్‌(Nivetha Pethuraj). స్టయిలీష్‌ లుక్‌లో తొలి చిత్రంతోనే తెలుగు ఆడియెన్స్ కి, టాలీవుడ్‌ మేకర్స్ కి కనెక్ట్ అయ్యింది. దీంతో ఆమెని ఎంకరేజ్‌చేస్తున్నారు. అవకాశాలు బాగానే వస్తున్నాయి. ఇప్పటికే ఆరు సినిమాలు చేసింది నివేతా. అయితే ఆమెకి వస్తున్న పాత్రలన్నీ సెకండ్‌ హీరోయిన్‌గానే కావడం గమనార్హం. 

`మెంటల్‌ మదిలో` హీరోయిన్‌గా పరిచయం అయ్యింది Nivetha Pethuraj. ఆ తర్వాత సాయిధరమ్‌ తేజ్‌తో `చిత్రలహరి`లో నటించింది. ఇందులోనూ కళ్యాణి ప్రియదర్శి మెయిన్‌ లీడ్‌ కాగా, సెకండ్‌ హీరోయిన్‌గా నివేతా కనిపించింది. ఈ సినిమాతో విజయాన్ని అందుకుంది. `మెంటల్‌ మదిలో` తర్వాత మరోసారి శ్రీవిష్ణుతో `బ్రోచేవారెవరురా` చిత్రంలో నటించింది. ఇందులో నివేదా థామస్‌ మెయిన్‌ లీడ్‌కాగా, నివేతా పేతురాజ్‌ సెకండ్‌ హీరోయిన్‌. 

Latest Videos

అల్లు అర్జున్‌తో `అల వైకుంఠపురములో` చిత్రంలో నటించింది. ఇందులో పూజా హేగ్దే మెయిన్‌ లీడ్‌ కాగా, ఈ బ్యూటీ సెకండ్‌ హీరోయిన్‌గా మెరిసింది. అంతేకాదు రామ్‌ నటించిన `రెడ్‌` చిత్రంలోనూ ముగ్గురు హీరోయిన్లలో ఒకరిగా నటించింది. ప్రస్తుతం విడుదల కావాల్సిన `విరాటపర్వం`లోనూ మెయిన్‌ లీడ్‌ కాదు. కేవలం విశ్వక్‌ సేన్‌ నటించిన `పాగల్‌` చిత్రంలోనే హీరోయిన్‌గా నటించింది. ఇప్పుడు మరోసారి ఆయనతో `దమ్కీ` సినిమా చేస్తుంది. 

అయితే ఇదే కాదు నివేతా పేతురాజ్‌కి మరో ఛాన్స్ వచ్చింది. చిరంజీవి(Chiranjeevi) చిత్రంలో నటించే అవకాశం ఈ అమ్మడిని వరించిందని తెలుస్తుంది. అయితే ఇందులోనూ సెకండ్‌ లీడ్‌ కావడం గమనార్హం. బాబీ దర్శకత్వంలో చిరంజీవి `మెగా154`చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో ఆయనకు జోడీగా శృతి హాసన్‌(Shruti Haasan) నటిస్తుంది. అయితే మాస్‌ మహారాజా రవితేజ(Raviteja) కూడా ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. చిరుకి తమ్ముడి రోల్‌. ఇందులో రవితేజ సరసన నివేతా పేతురాజ్‌ కనిపించబోతున్నట్టు సమాచారం. ఇదే నిజమైతే ఇక నివేతా అంటే సెకండ్‌ హీరోయిన్‌ అనే ట్యాగ్‌ తో పిలుస్తారేమో చూడాలి. 

click me!