నిత్యా మేనన్‌ నుంచి మరొక ‘మాస్టర్‌పీస్‌’,ట్రైలర్‌ కేక పెట్టించింది

Published : Oct 01, 2023, 10:35 AM IST
 నిత్యా మేనన్‌ నుంచి మరొక ‘మాస్టర్‌పీస్‌’,ట్రైలర్‌ కేక పెట్టించింది

సారాంశం

ఫ‌న్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ వెబ్‌సిరీస్  ‘డిస్నీ+హాట్‌స్టార్‌’ (Disney+ Hotstar)లో అక్టోబరు 25 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఈ నేపధ్యంలో  ట్రైలర్‌ను విడుదల చేశారు. 

ఓ ప్రక్కన  సినిమాల‌ు మరో ప్రక్క  వెబ్‌సిరీస్‌ల‌తో దూసుకోపోతోంది  నిత్యామీన‌న్‌ (Nithya Menen). బ్రీత్ సీజ‌న్ 1, సీజ‌న్ 2తో వెబ్‌సిరీస్‌ల‌తో ఓటీటీ ప్రేక్ష‌కుల్ని మెప్పించిన నిత్యామీన‌న్ రీసెంట్ గా తెలుగులో ‘కుమారి శ్రీమతి’ (Kumari Srimathi)వెబ్ సీరిస్ తో పలకరించింది. అలాగే ఇప్పుడు ఫ‌స్ట్ టైమ్ మ‌ల‌యాళంలో ఓ వెబ్‌సిరీస్ చేస్తోంది. ‘మాస్టర్‌పీస్‌’ (Master Peace) టైటిల్ తో ఫ‌న్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ వెబ్‌సిరీస్  ‘డిస్నీ+హాట్‌స్టార్‌’ (Disney+ Hotstar)లో అక్టోబరు 25 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఈ నేపధ్యంలో  ట్రైలర్‌ను విడుదల చేశారు. 

మొగడు పెళ్లాం గొడవలు, మధ్యలో అత్తగారు తో వాదనలుతో  ఆద్యంతం నవ్వులు పంచేలా ఈ సిరీస్‌ని రూపొందించినట్లు ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది. నిత్యా మేనన్‌.. రియా అనే పాత్రలో కనిపిస్తోంది. శ్రీజిత్‌ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో షరాఫ్‌, రెంజి పనికర్‌, మాలా పార్వతి, అశోకన్‌, శాంతి కృష్ణ తదితరులు కీలక పాత్రలు పోషించారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, బెంగాలీ, మరాఠీ ఆడియోతో ఈ సిరీస్‌ స్ట్రీమింగ్‌ అవుతుందని ఓటీటీ సంస్థ తెలిపింది.  కేర‌ళ క్రైమ్ ఫైల్స్ త‌ర్వాత డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌లో రిలీజ్ కానున్న సెకండ్ మ‌ల‌యాళం వెబ్‌సిరీస్ ఇదే కావ‌డం గ‌మ‌నార్హం.  

సినిమాల విషయానికి వస్తే...భీమ్లానాయ‌క్ త‌ర్వాత తెలుగు సినిమాల‌కు బ్రేక్ ఇచ్చింది నిత్యామీన‌న్‌. త‌మిళ‌, మ‌ల‌యాళ సినిమాల‌పై ఎక్కువ‌గా దృష్టిసారిస్తోంది. గ‌త ఏడాది తిరుచిత్రాంబ‌ళం సినిమాతో పెద్ద క‌మ‌ర్షియ‌ల్ హిట్‌ను అందుకున్న‌ది.ధనుష్ 50వ చిత్రం #D50 (వర్కింగ్‌ టైటిల్‌)తోపాటు ఓ మలయాళ చిత్రంలో ఆమె నటిస్తున్నారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Thalapathy Vijay సినిమా స్టోరీ లీక్, జన నాయగన్ కథ ఇదేనా? షాక్ లో మూవీ టీమ్
Pawan Kalyan కోసం రామ్ చరణ్ త్యాగం? పెద్ది రిలీజ్ పై మెగా అభిమానుల్లో ఆందోళన