కష్టాల్లో టీమిండియా.. సెంటిమెంట్ పై భారం వేసిన హీరో నితిన్!

Published : Jul 10, 2019, 05:14 PM IST
కష్టాల్లో టీమిండియా.. సెంటిమెంట్ పై భారం వేసిన హీరో నితిన్!

సారాంశం

ప్రస్తుతం దేశం మొత్తం క్రికెట్ ఫీవర్ కనిపిస్తోంది. టీమిండియా, న్యూజిలాండ్ జట్లు సెమీఫైనల్ లో తలపడుతున్నాయి. ఇప్పటివరకు తిరుగులేని ప్రదర్శనతో టీమిండియా సెమీస్ కు చేరింది. 

ప్రస్తుతం దేశం మొత్తం క్రికెట్ ఫీవర్ కనిపిస్తోంది. టీమిండియా, న్యూజిలాండ్ జట్లు సెమీఫైనల్ లో తలపడుతున్నాయి. ఇప్పటివరకు తిరుగులేని ప్రదర్శనతో టీమిండియా సెమీస్ కు చేరింది. కానీ సెమీస్ లో మాత్రం కష్టాలు తప్పడం లేదు. టీమిండియా బ్యాటింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే కీలకమైన వికెట్స్ కోల్పోయి పీకల్లోతులో కష్టాలలో కూరుకుపోయింది. 

సినీతారలు కూడా క్రికెట్ కు దాసులే. ఇండియా వరుస వికెట్స్ కోల్పోయిన తర్వాత హీరో నితిన్ ట్వీట్ చేశాడు. ఇండియా గెలుపుకోసం అభిమానులంతా సెంటిమెంట్ ఫాలో కావాలని కోరాడు. 'మీకిష్టమైన లక్కీ ప్లేస్ లో కూర్చోండి.. లక్కీ డ్రెస్ వేసుకోండి.. నేనిప్పుడు అదే చేస్తున్నా..కమాన్ ఇండియా' అంటూ నితిన్ ట్వీట్ చేశాడు. 

మరి నితిన్ సెంటిమెంట్ మాత్రం ఇండియాని గెలిపిస్తుందో లేదో చూడాలి. ఇక సినిమాల విషయానికి వస్తే వెంకీ కుడుముల దర్శకత్వంలో భీష్మ చిత్రంలో నితిన్ నటిస్తున్నాడు. మరికొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ కి కూడా నితిన్ సైన్ చేశాడు. 

 

PREV
click me!

Recommended Stories

Remuneration: సౌత్‌లో అత్యధిక పారితోషికం తీసుకున్న ఒకే ఒక్కడు.. ఆయన ముందు ప్రభాస్, విజయ్‌, అల్లు అర్జున్‌ జుజూబీ
2025లో 8 జంటల సీక్రెట్ లవ్ ఎఫైర్స్ ..లిస్ట్ లో రాంచరణ్, ప్రభాస్, మహేష్ హీరోయిన్లు