తాజా వార్తలుఎంటర్‌టైన్‌మెంట్క్రికెట్జీవనశైలిఆంధ్రప్రదేశ్తెలంగాణబిజినెస్జ్యోతిష్యంKEA 2025

నితిన్‌ `చెక్‌` పెట్టే డేట్‌ ఫిక్స్ చేసుకున్నాడు.. లవర్స్ డే తర్వాతే..

Aithagoni Raju | Published : Jan 22, 2021 6:57 PM

గతేడాదితో `భీష్మ`తో సూపర్‌ హిట్‌ అందుకున్న నితిన్‌ ఇప్పుడు ఫుల్‌ జోష్‌లో ఉన్నారు. బ్యాక్‌ టూ బ్యాక్‌ మూడు సినిమాలు చేస్తున్నారు. అందులో ఒకటి `చెక్‌`. క్రియేటివ్‌ డైరెక్టర్ చంద్రశేఖర్‌ ఏలేటి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ని ఫిక్స్ చేశారు.

గతేడాదితో `భీష్మ`తో సూపర్‌ హిట్‌ అందుకున్న నితిన్‌ ఇప్పుడు ఫుల్‌ జోష్‌లో ఉన్నారు. బ్యాక్‌ టూ బ్యాక్‌ మూడు సినిమాలు చేస్తున్నారు. అందులో ఒకటి `చెక్‌`. క్రియేటివ్‌ డైరెక్టర్ చంద్రశేఖర్‌ ఏలేటి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ని ఫిక్స్ చేశారు. ఫిబ్రవరి 19న విడుదల చేయనున్నట్టు తాజాగా శుక్రవారం చిత్ర బృందం వెల్లడించింది. 

ఇక ఇందులో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, ప్రియా ప్రకాష్‌ వారియర్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కోర్ట్ రూమ్‌ ప్రధానంగా, యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఈ సినిమా సాగుతుందని అర్థమవుతుంది. ఇందులో ఆదిత్య అనే కుర్రాడి పాత్రలో  నితిన్‌ నటిస్తున్నారు. చెస్‌ అద్భుతంగా ఆడే ఆదిత్య.. దేశద్రోహిగా ఎందుకు మారాడు, ఎలా మారాడనే కథాంశంతో ఈ సినిమా రూపొందుతుందని అర్థమవుతుంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌ సినిమాపై అంచనాలను పెంచుతుంది. 

ఇందులో నితిన్‌ ఓ డిఫరెంట్‌ రోల్‌లో కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. మరోవైపు ఈ సినిమాలో రకుల్‌ లాయర్‌గా నటిస్తుంది. నితిన్‌కి జోడిగా లవ్‌ ఇంట్రెస్ట్ గా ప్రియా ప్రకాష్‌ వారియర్‌ కనిపించబోతునట్టు టాక్‌.దీంతోపాటు నితిన్‌ `రంగ్‌ దే`, `అంధాధున్‌` రీమేక్‌లో నటిస్తున్నారు.

About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!