నితిన్ 'భీష్మ' రిలీజ్ డేట్ ఫిక్స్.. మెగా హీరోతో పోటీ!

Published : Aug 28, 2019, 06:46 PM ISTUpdated : Aug 28, 2019, 06:51 PM IST
నితిన్ 'భీష్మ' రిలీజ్ డేట్ ఫిక్స్.. మెగా హీరోతో పోటీ!

సారాంశం

యంగ్ హీరో నితిన్ నటిస్తున్న తాజా చిత్రం 'భీష్మ'. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఛలో ఫేమ్ వెంకీ కుడుముల దర్శకుడు. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. అ..ఆ తర్వాత నితిన్ కు సరైన హిట్ లేదు.

యంగ్ హీరో నితిన్ నటిస్తున్న తాజా చిత్రం 'భీష్మ'. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఛలో ఫేమ్ వెంకీ కుడుముల దర్శకుడు. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. అ..ఆ తర్వాత నితిన్ కు సరైన హిట్ లేదు. దీనితో భీష్మ చిత్రంతో ఎలాగైనా హిట్ అందుకోవాలని నితిన్ ప్రయత్నిస్తున్నాడు. 

తాజాగా ఈ చిత్రం రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. భీష్మ చిత్రాన్ని క్రిస్టమస్ కానుకగా విడుదల చేయనున్నట్లు నితిన్ తాజాగా సోషల్ మీడియాలో ప్రకటించారు. చేతిలో రోజా పువ్వు పట్టుకుని ఉండే రొమాంటిక్ పోస్టర్ ని పోస్ట్ చేశాడు. భీష్మ చిత్రం మిమ్మల్ని ఎంటర్ టైన్ చేయడానికి ఈ క్రిస్టమస్ కు థియేటర్స్ లోకి వస్తోంది అని నితిన్ తెలిపాడు. 

ఛలో ఫేమ్ స్వర సాగర్ మహతి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. నితిన్ సరసన క్రేజీ బ్యూటీ రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రం తర్వాత నితిన్ రంగ్ దే చిత్రంలో నటించనున్నాడు. ఈ చిత్రానికి తొలిప్రేమ ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకుడు. ఈ చిత్రంలో నితిన్ కు హీరోయిన్ గా కీర్తి సురేష్ నటిస్తోంది. 

ఈ క్రిస్టమస్ కు సాయిధరమ్ తేజ్ నటిస్తున్న ప్రతి రోజూ పండుగే చిత్రం కూడా విడుదల కానుంది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ పై కూడా మంచి అంచనాలున్నాయి. 

 

PREV
click me!

Recommended Stories

Vijay Divorce: భార్యకి విజయ్‌ రూ.250 కోట్ల భరణం.. సంగీత విడాకుల కేసులో ఊహించని ట్విస్ట్
Ustaad Bhagat Singh vs Dhurandhar 2: ధురంధర్‌ 2 కూడా వాయిదా.. మార్చి 19న పవన్‌ కళ్యాణ్‌ ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌