మెగాస్టార్ తో నితిన్ బాక్స్ ఆఫీస్ ఫైట్

Published : Jul 12, 2019, 11:04 AM ISTUpdated : Jul 12, 2019, 11:31 AM IST
మెగాస్టార్ తో నితిన్ బాక్స్ ఆఫీస్ ఫైట్

సారాంశం

ఈ ఏడాది బడా సినిమాల హవా దేశమంతా కనిపించనుంది. పాన్ ఇండియన్ సినిమాల జోరు పెరుగుతున్న సమయంలో నిర్మాతలు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ముఖ్యంగా రిలీజ్ డేట్స్ లలో బాగా అలోచించి గాని ఒక నిర్ణయానికి రావడం లేదు.   

ఈ ఏడాది బడా సినిమాల హవా దేశమంతా కనిపించనుంది. పాన్ ఇండియన్ సినిమాల జోరు పెరుగుతున్న సమయంలో నిర్మాతలు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ముఖ్యంగా రిలీజ్ డేట్స్ లలో బాగా అలోచించి గాని ఒక నిర్ణయానికి రావడం లేదు. 

అయితే హీరోల దూకుడుకు కొంతమంది సినిమాలు రిలీజ్ చేయక తప్పడం లేదు. ప్రస్తుతం నితిన్ కూడా దసరాకు తన సినిమా రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. అయితే అదే సమయంలో మెగాస్టార్ చిరంజీవి సైరా కూడా రిలీజ్ కాబోతోంది. నితిన్ - వెంకీ కుడుములు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భీష్మా షూటింగ్ ఇటీవలే మొదలైంది. 

అయితే ఛల్ మోహన్ రంగ అనంతరం మరో సినిమా విడుదల చేయని నితిన్ చాలా గ్యాప్ వచ్చిందని దసరా మూమెంట్ లో భీష్మాతో హడావుడి చేయాలనీ అనుకుంటున్నాడు. భారీ అంచనాల నడుమ వస్తోన్న సైరా తో పోటీకి ఏ మాత్రం సందేహించడం లేదు. అయితే ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. 

PREV
click me!

Recommended Stories

చిరంజీవి దెబ్బకు యుఎస్ లో రికార్డులు గల్లంతు.. బాలకృష్ణ, ప్రభాస్ సినిమాలకు చుక్కలు చూపించేలా కలెక్షన్స్
8 ఫొటోల్లో కృతి సనన్ చెల్లి పెళ్లి వేడుక.. చూడముచ్చటగా వధూవరులు, వైరల్ అవుతున్న దృశ్యాలు