Nithiin: మెగాస్టార్ సినిమాలో నితిన్.. ఆమెకు భర్తగా యంగ్ హీరో ? 

Published : Jun 14, 2022, 10:00 AM IST
Nithiin: మెగాస్టార్ సినిమాలో నితిన్.. ఆమెకు భర్తగా యంగ్ హీరో ? 

సారాంశం

మెగాస్టార్ చిరంజీవి చిత్రంలో నితిన్ భాగం కాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం చిరు గాడ్ ఫాదర్, భోళా శంకర్ చిత్రాల్లో నటిస్తున్నాడు. 

యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం మాచర్ల నియోజకవర్గం చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఎడిటర్ శేఖర్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అలాగే నితిన్ వక్కంతం వంశీ దర్శకత్వంలో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. నితిన్ చివరగా రంగ్ దే, చెక్, మాస్ట్రో చిత్రాల్లో నటించాడు. 

ఈ ఏడాది మాచర్ల నియోజకవర్గం రిలీజ్ కానుంది. ఇదిలా ఉండగా నితిన్ గురించి ఓ క్రేజీ న్యూస్ వైరల్ గా మారింది. మెగాస్టార్ చిరంజీవి చిత్రంలో నితిన్ భాగం కాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం చిరు గాడ్ ఫాదర్, భోళా శంకర్ చిత్రాల్లో నటిస్తున్నాడు. భోళా శంకర్ చిత్రంలో కీలక పాత్ర కోసం నితిన్ సైన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. 

ఈ చిత్రంలో చిరంజీవి సోదరి పాత్రలో 'మహానటి' కీర్తి సురేష్ నటిస్తోంది. కీర్తి సురేష్ భర్తగా నితిన్ నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన లేదు. నితిన్ మెగాస్టార్ చిత్రంలో భాగం కాబోతున్నట్లు అనే న్యూస్ బయటకి రావడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

కీర్తి సురేష్, నితిన్ రంగ్ దే చిత్రంలో జంటగా నటించారు. వీళ్లిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. కాబట్టే దర్శకుడు మెహర్ రమేష్ నితిన్ ని సంప్రదించాడట. నితిన్ కూడా ఒకే చెప్పాడని.. త్వరలోనే అనౌన్స్ మెంట్ రానున్నట్లు తెలుస్తోంది. అయితే నితిన్ కేవలం చాలా తక్కువ సమయం మాత్రమే కనిపిస్తాడట. 

ఓ వైపు నితిన్ బిజీ షెడ్యూల్ లో ఉన్నప్పటికీ మెగాస్టార్ కోసం ఈ చిత్రం చేయబోతున్నాడని అంటున్నారు. ఇక భోళా శంకర్ పై అనేక రూమర్స్ వినిపించాయి. ఆచార్య ఫ్లాప్ కారణంగా చిరంజీవి తన తదుపరి చిత్రాల విషయంలో జాగ్రత్తగా ఉంటున్నారని.. భోళా శంకర్ చిత్రాన్ని ఆపేశారని కూడా రూమర్స్ వినిపించాయి. ఆ రూమర్స్ కి చెక్ పెడుతూ చిత్ర యూనిట్ కొత్త షెడ్యూల్ కి రెడీ అవుతోంది. 

PREV
click me!

Recommended Stories

Akhanda 2: అఖండ 2 రిలీజ్ కి తొలగిన అడ్డంకులు, మద్రాస్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. కానీ ఆ ఒక్క సమస్య ఇంకా ఉంది
Prabhas in Japan: జపాన్ లో భూకంపం నుంచి ప్రభాస్ సేఫ్.. హమ్మయ్య, రెబల్ స్టార్ కి గండం తప్పింది