ప్రెగ్నెన్సీ పై స్పందించిన నిక్కీ గల్రానీ.. రూమర్లపై ఫైర్ అవుతున్న యంగ్ బ్యూటీ!

By team teluguFirst Published Nov 19, 2022, 5:44 PM IST
Highlights

యంగ్ హీరో ఆది పినిశెట్టి (Aadhi Pinisetty) - హీరోయిన్ నిక్కీ గల్రానీ ఈ ఏడాది పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో వీరిద్దరిరూ తల్లిదండ్రులు కాబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. వీటిపై తాజాగా నిక్కీ స్పందించింది. 
 

తెలుగు, తమిళ భాషల్లో క్రేజీ నటుడిగా గుర్తింపు సొంతం చేసుకున్నాడు హీరో ఆది పినిశెట్టి. లీడ్ రోల్స్ తో పాటు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా ఆది ఆడియెన్స్ ను ఆకట్టుకున్నాడు. ఈ ఏడాది కోలీవుడ్ హీరోయిన్ నిక్కీ గల్రానీ (Nikki Gilrani)ని ఆది పినిశెట్టి పెండ్లి చేసుకున్న విషయం తెలిసిందే. తమిళంలో బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లోనటిస్తున్న క్రమంలో నిక్కీతో పరిచయం ఏర్పడి పెండ్లి వరకు వచ్చింది.  ఈ ఏడాది మే 18న చెన్సైలో వీరిద్దరి వెడ్డింగ్ చాలా గ్రాండ్ గా జరిగింది. వీరి వెడ్డింగ్ కు కోలీవుడ్, టాలీవుడ్ సినీ స్టార్స్, సెలబ్రెటీలు హాజరై విషెస్ తెలిపారు.

మ్యారేజ్ అయి దాదాపు 11 నెలలు దాటిపోయింది. పెళ్లి తర్వాత ఈ స్టార్ కపుల్ టూర్లు, వేకేషన్లను వెళ్తూ మ్యారేజ్ లైఫ్ ను తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఎప్పుడూ నెట్టింట సందడి చేస్తూనే కనిపిస్తున్నారు. ఈ క్రమంలో ఆది - నిక్కీ గురించి ఓ క్రేజీ న్యూస్ నెట్టింట వైరల్ అయ్యింది. వీరిద్దరూ త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారంటూ వార్తలు పుట్టుకొచ్చాయి. ఇప్పటికే నిక్కీ గల్రానీకి పెగ్రెన్సీ కన్ఫమ్ అయ్యిందంటూ నెట్టింట తెగ ప్రచారం జరిగింది.  ఈ వార్త తాజాగా హీరోయిన్ నిక్కీ దాకా చేరడంతో క్లారిటీ ఇచ్చింది.

నేను ప్రెగ్నెంట్ అంటూ వస్తున్న వార్తలో నిజం లేదని స్పష్టం చేసింది. తను గర్భవతి కాదని తెలిపింది. కొంతమంది తను ప్రెగ్నెంట్ అంటూ న్యూస్ వైరల్ చేశారు. వాళ్లే కొంచె నా డెలివరీ డేట్ కూడా చెప్పాలని ఘాటుగా బదులిచ్చింది. ప్రస్తుతం ప్రెగ్నెన్సీ లేదు.. నిజమైతే నేనే చెబుతాను. అంతవరకు ఇలాంటి రూమర్లను ప్రచారం చేయొద్దంటూ ఫైర్ అయ్యింది. మొన్నటి వరకు దీనిపై స్పందించకపోవడంతో నిజమనే భావించారు. మొత్తానికి వాస్తవం కాదని నిక్కీనే కన్ఫమ్ చేసింది. ప్రస్తుతం నిక్కీ గల్రానీ, ఆది తమ మ్యారేజ్ లైఫ్ ను ఎంజాయ్  చేస్తూనే కేరీర్ ను కూడా కొనసాగిస్తున్నారు. 

pic.twitter.com/1tucglygut

— Nikki Galrani Pinisetty (@nikkigalrani)
click me!