Nikhil New Movie Poster: నిఖిల్ దూకుడు, కొత్త సినిమా, కొత్త పోస్టర్ తో యంగ్ స్టార్

Published : Apr 16, 2022, 02:11 PM ISTUpdated : Apr 16, 2022, 02:12 PM IST
Nikhil New Movie Poster: నిఖిల్ దూకుడు, కొత్త సినిమా, కొత్త పోస్టర్ తో యంగ్ స్టార్

సారాంశం

కరోనా వల్ల బ్రేక్ పడిన సినిమా బండి స్పీడ్ పెంచాడు టాలీవుడ్ యంగ్ స్టార్ నిఖిల్. ఇప్పటికే రెండు సినిమాలు రిలీజ్ కు రెడీ చేస్తున్న హీరో.. మరో కొత్త సినిమా పోస్టర్ లో సందడి చేయబోతున్నాడు.   

కరోనా వల్ల బ్రేక్ పడిన సినిమా బండి స్పీడ్ పెంచాడు టాలీవుడ్ యంగ్ స్టార్ నిఖిల్. ఇప్పటికే రెండు సినిమాలు రిలీజ్ కు రెడీ చేస్తున్న హీరో.. మరో కొత్త సినిమా పోస్టర్ లో సందడి చేయబోతున్నాడు. 

నిఖిల్ హీరోగా గారీ ద‌ర్శ‌క‌త్వంలో ఓ స్పై థ్రిల్ల‌ర్ సినిమా తెర‌కెక్క‌నుంది. గ‌తేడాదే ఈ సినిమాకి సంబంధించి నిఖిల్ అనౌన్స్‌మెంట్‌ను  సోష‌ల్ మీడియాలో ఇచ్చాడు. అయితే  కరోనా వల్ల ఇప్ప‌టి వ‌ర‌కు ఈ సినిమాపై ఎలాంటి అప్‌డేట్ రాలేదు. ఇక రీసెంట్ గా ఈ సినిమాకు  సంబంధించిన బిగ్ అప్‌డేట్‌ను ఇచ్చారు మేకర్స్. ఈ సినిమా టైటిల్‌తో పాటు ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేయబోతున్నట్టు తెలిపారు. 

ఆదివారం ఉదయం 11.11 నిమిషాలకు విడుద‌ల చేయ‌నున్న‌ట్లు మేక‌ర్స్ పోస్ట‌ర్‌ను రిలీజ్  చేశారు. గ‌న్స్‌, బుల్లెట్లు, రూట్ మ్యాప్‌లు ఉన్న ఈ పోస్ట‌ర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఐశ్వ‌ర్య మీన‌న్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈమూవీని  ఈడీ ఎంట‌ర్టైన‌మెంట్స్ ప‌తాకంపై రాజ‌శేఖ‌ర్ రెడ్డి నిర్మిస్తున్నారు. 

 

 

నిఖిల్ కంటెంట్ ఉన్న‌ క‌థ‌ల‌ను ఎంచుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. ప్రయోగాలకు పెద్ద పీట వేస్తున్నాడు. హ్యాపీడేస్ సినిమాతో వెండి తెర‌కు ప‌రిచ‌య‌మైన నిఖిల్ మొద‌టి సినిమాతోనే  ఆడియన్స్ కు ద‌గ్గ‌ర‌య్యాడు. ఆతరువాత వ‌రుసగా ఫెయిల్యూర్స్ ఫేస్ చేసిన యంగ్ హీరో...స్వామి రారా సినిమాతో మంచి సక్సెస్ ను అందుకున్నాడు. ఈ సినిమా నిఖిల్  కెరీర్ ములుపు తిప్పింది. 

నిఖిల్ క‌థ‌ల‌ను ఎంపిక చేసుకునే విధానం పూర్తిగా మారిపోయింది. కార్తికేయ‌, ఎక్క‌డికి పోతావ్ చిన్న‌వాడ‌, అర్జున్ సుర‌వ‌రం వంటి స్టోరీ బేస్డ్ మూవీస్ తో మంచి విజ‌యాల‌ను సాధించి ఆడియన్స్ లో  క్రేజ్‌ను ఏర్ప‌ర‌చుకున్నాడు. ప్ర‌స్తుతం నిఖిల్  నాలుగు సినిమాల‌ను లైన్లో పెట్టాడు. నిఖిల్ న‌టించిన కార్తికేయ‌-2, 18 పేజీస్ రిలీజ్ కు రెడీగా ఉన్నాయి. 

PREV
click me!

Recommended Stories

Rajamouli కి పోటీగా.. 1000 కోట్లతో శంకర్ సినిమా, ఎప్పుడు స్టార్ట్ కాబోతోంది? హీరో ఎవరు?
Venu Swamy: అయ్యో, వేణు స్వామి పూజ వృధాగా పోయిందిగా.. అఖండ 2 వాయిదాతో మరోసారి ట్రోలింగ్