
టాలీవుడ్ సూపర్ స్టార్ భార్య, బాలీవుడ్ బాద్ షా సతీమణి.. ఈ ఇద్దరు స్టార్ భార్యామణులు కలిశారు.. అంతే కాదు కలిసి లంచ్ కూడా చేశారు. ఇంతకీ ఈ మీట్ ఎందుకు..? ఎక్కడా..? ఎప్పుడూ..?
ఒకరు టాలీవుడ్ సూపర్ స్టార్ భార్య...మరొకరు బాలీవుడ్ సూపర్ స్టార్ భార్య. క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఈ ఇద్దరు స్టార్లు ఒక చోట కలిస్తే..? ఈ స్టార్ కొలాబ్రేషన్ గ్రాండ్ గా జరిగింది. మహేశ్ బాబు , షారుక్ ఖాన్ ఈ స్టార్ హీరోలిద్దరి కుటుంబాల మధ్య మంచి అనుబంధం ఉంది. బాద్ షా నేషనల్ స్టార్ కాబట్టి పలువురు తెలుగు హీరోలలో కొంత మందితో మంచి స్నేహబంధం ఉంది. అందులో సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీతో కూడా అంతే అనుబంధం ఉంది.
ఇక మహేశ్ కూడా బాలీవుడ్‌లోకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ఈ ఇద్దరు స్టార్ హీరోల సతీమణులు కూడా తీరిక సమయం దొరికితే ఒక్క చోట కలవడానికి ప్రయత్నిస్తుంటారు. తాజాగా అలాంటి అరుదైన సందర్భం కుదిరింది. సూపర్ స్టార్ మహేశ్ భార్య నమ్రతా శిరోద్కర్, షారుక్ ఖాన్ సతీమణి గౌరీఖాన్ కలిసి ఎవరూ ఊహించని విధంగా లంఛ్ డేట్ ప్లాన్ చేశారు. షారుఖ్ ఖాన్ నివాసం దీనికి వేదిక అయ్యింది.
ఇద్దరూ మంచి స్నేహితులు కావడంతో మధుర జ్ఞాపకాలను షేర్ చేసుకున్నారు. గౌరీఖాన్‌తో లంఛ్ డేట్ వెళ్లిన సమయంలో దిగిన ఫొటోను నమ్రతా ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. గౌరీఖాన్ ఇంట్లో ఊహించని సరదా భోజనం..గౌరీఖాన్ హౌస్‌లో..అక్షరాలాగా చాలా సంవత్సరాల తర్వాత కలుసుకోవడం..సమయం నిలకడగా ఉంది..పూర్తి లంచ్ ఫ్లాష్‌బ్యాక్‌లు, గొప్ప జ్ఞాపకాలు, చాలా నవ్వులు మిగిల్చింది..అంటూ తన హ్యాపీనెస్‌ను షేర్ చేసుకుంది నమ్రతా. స్టార్ హీరోల సతీమణుల లంఛ్ డేట్ ఫొటో ఇపుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.