టీడీపీకి మద్దతుగా కుర్ర హీరో ప్రచారం!

Published : Apr 05, 2019, 10:27 AM IST
టీడీపీకి మద్దతుగా కుర్ర హీరో ప్రచారం!

సారాంశం

ఎన్నడూ లేని విధంగా ఈసారి ఏపీ ఎన్నికలు ఉత్కంఠను రేపుతున్నాయి. సినీ తారల సందడి మరీ ఎక్కువైంది. మన తారలు కొందరు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా పోటీ చేస్తున్నారు. 

ఎన్నడూ లేని విధంగా ఈసారి ఏపీ ఎన్నికలు ఉత్కంఠను రేపుతున్నాయి. సినీ తారల సందడి మరీ ఎక్కువైంది. మన తారలు కొందరు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా పోటీ చేస్తున్నారు. మరికొందరు సెలబ్రిటీలు తమకు నచ్చిన పార్టీకి మద్దతు తెలుపుతూ ప్రచారాల్లో పాల్గొంటున్నారు. 

యువ హీరో నిఖిల్ కూడా ప్రచారంలో పాల్గొన్నాడు. కర్నూలు జిల్లా డోన్ టీడీపీ అభ్యర్థి కెఈ ప్రతాప్ తరఫున నిఖిల్ ప్రచారం చేయడం ఆసక్తికరంగా మారింది. అభివృద్ధికి ఓటేయండి, మన ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాలి అంటూ కెఈ ప్రతాప్ ని గెలిపించామని నిఖిల్ ప్రచారం చేశాడు.

తెలంగాణా వాసి అయిన నిఖిల్ ఏపీ రాజకీయాల్లో ప్రచారం చేయడం, టీడీపీని మళ్లీ అధికారంలోకి తీసుకురావాలని కోరడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. సోషల్ మీడియాలో జనసేన పార్టీని పొగిడే నిఖిల్ ఇప్పుడు టీడీపీకి సపోర్ట్ గా నిలవడంపై కొందరు సెటైర్లు వేస్తున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Nagarjuna: నాగార్జున రోజూ తినే ఫుడ్ ఇదే.. ఆ జ్యూస్ వల్లే ఆయన జుట్టు ఇంకా రాలిపోలేదు.!
10 ఏళ్ల స్టార్ కిడ్ ను గుర్తుపట్టారా? చిన్నారి శివాజీగా అదరగొట్టిన హీరోయిన్ కొడుకు ఎవరో తెలుసా?