ఆమెకు హిట్టిచ్చి అక్కినేని పరువు కాపాడు అఖిల్?

Published : Jan 24, 2019, 07:27 PM IST
ఆమెకు హిట్టిచ్చి అక్కినేని పరువు కాపాడు అఖిల్?

సారాంశం

బాలీవుడ్ క్యూట్ బ్యూటీ నిధి అగర్వాల్ తెలుగు సినిమాలపై ఎంతో నమ్మకం పెట్టుకొని బాలీవుడ్ లో ప్రయత్నాలు తగ్గించింది. మొదట సౌత్ లో హిట్స్ అందుకుంటే బాలీవుడ్ నుంచి ఈజీగా అవకాశాలు అందుకోవచ్చని అలోచించి గత ఏడాది వచ్చిన సవ్యసాచిలో నటించింది. 

బాలీవుడ్ క్యూట్ బ్యూటీ నిధి అగర్వాల్ తెలుగు సినిమాలపై ఎంతో నమ్మకం పెట్టుకొని బాలీవుడ్ లో ప్రయత్నాలు తగ్గించింది. మొదట సౌత్ లో హిట్స్ అందుకుంటే బాలీవుడ్ నుంచి ఈజీగా అవకాశాలు అందుకోవచ్చని అలోచించి గత ఏడాది వచ్చిన సవ్యసాచిలో నటించింది. అక్కినేని నాగ చైతన్య - చందు మొండేటి కాంబినేషన్ లో వచ్చిన ఆ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. 

అక్కినేని అన్నయ్య హిట్టివ్వకపోవడంతో ఇప్పుడు తమ్ముడిపైన ఆశలు పెట్టుకుంది. మిస్టర్ మజ్ను సినిమాలో అఖిల్ తో నటించిన ఈ బ్యూటీ గట్టినమ్మకంతో ఉంది. ఇక మరోవైపు అఖిల్ కూడా తన మొదటి బాక్స్ ఆఫీస్ హిట్ కూడా అందుకోవాలని మిస్టర్ మజ్ను కోసం బాగానే కష్టపడ్డాడు. కానీ సినిమా ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది రిలీజ్ తరువాత గాని తెలియదు. 

నిధి అగర్వాల్ క్లి సౌత్ లో అవకాశాలు రావాలంటే ఈ సినిమా హిట్టవడం తప్పనిసరి. అందుకే అఖిల్ ఈ సినిమాతో హిట్ కొట్టి.. ఆమెకు కూడా హిట్టిచ్చి అక్కినేని పరువు కాపాడాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరి అఖిల్ కష్టం ఏ స్థాయిలో ఉందొ తెలియాలంటే మరికొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే. 

PREV
click me!

Recommended Stories

నాగార్జున ను 15 ఏళ్లుగా వెంటాడుతున్న అనారోగ్య సమస్య ఏంటో తెలుసా? ఎందుకు తగ్గడంలేదు?
Sivaji: కులం అనేది ఒక ముసుగు మాత్రమే, డబ్బున్నోళ్ల లెక్కలు వేరు.. శివాజీ బోల్డ్ స్టేట్‌మెంట్‌