'తూనీగ.. ఒక దైవ రహస్యం'

By AN TeluguFirst Published Jul 27, 2019, 4:57 PM IST
Highlights

హైలీ టెక్నికల్ ఎలిమెంట్స్ తో రూపొందిన ఓ పురాణేతిహాస ప్రధాన చిత్రం 'తూనీగ'. భారతీయ పురాస్మతిలో అత్యంత ఆసక్తిదాయక కథావస్తువుతో రూపొందిన ఈ చిత్ర పోస్టర్‌ను ప్రముఖ కవి, రచయిత, దర్శకులు తనికెళ్ల భరణి ఆవిష్కరించారు. 

నూతన దర్శకుడు ప్రేమ్‌ సుప్రీం రూపొందించిన ప్రయోగాత్మక చిత్రం 'తూనీగ.. ఒక దైవ రహస్యం' . హైలీ టెక్నికల్ ఎలిమెంట్స్ తో రూపొందిన ఓ పురాణేతిహాస ప్రధాన చిత్రం. భారతీయ పురాస్మతిలో అత్యంత ఆసక్తిదాయక కథావస్తువుతో రూపొందిన ఈ చిత్ర పోస్టర్‌ను ప్రముఖ కవి, రచయిత, దర్శకులు తనికెళ్ల భరణి ఆవిష్కరించారు. 

'తాత్విక చింతన నేపథ్యంలో సాగే ఈ చిత్రం ఘన విజయం సాధించాలని' ఆయన ఆకాంక్షించారు. దేవరహస్యం వెల్లడించే క్రమంలో ఉత్కంఠతను పెంపొందించే కథాంశాన్ని తీసుకుని తెరకెక్కిన ఈ చిత్రంపై అంచనాలు పెంచేలా పోస్టర్‌ను డిజైన్‌ చేసిన తీరు బాగుందని అభినందించారు. భారతీయ సంస్కతిలో అనేకానేక తాత్వికపర అంశాలకు చర్చకు రాదగ్గ అర్హత ఉందని, ఆ కోవలోనే ఓ ఆసక్తికర అంశాన్ని తీసుకుని ఈ 'తూనీగ' చిత్రం రూపొందిందని, విజువల్‌ ఎఫెక్ట్స్‌ పరంగా కూడా ఉన్నత సాంకేతిక విలువలను పాటించారని వెల్లడించారు.

దర్శకులు ప్రేమ్‌ సుప్రీం మాట్లాడుతూ.. క్రౌడ్‌ ఫండింగ్‌ ద్వారా ప్రేమ్‌ పెయింటింగ్స్‌ పతాకంపై ఈ ప్రయోగాత్మక ప్రాజెక్టు చేపట్టామని, ఈ చిత్రానికి సంగీతం సిద్ధార్థ్‌ సదాశివుని, ఛాయాగ్రహణం రిషి ఎదిగ అందించారని వెల్లడించారు. ఆగస్టు మొదటివారంలో ఆడియో విడుదల కానుంది. ఈ చిత్రానికి పాట సాహిత్యాన్ని బాలాజీ, విశ్వప్రగడ, కిట్టు తదితరులు అందించారన్నారు. వినీత్‌, దేవయానీ శర్మ హీరో, హీరోయిన్లుగా పరిచయం అవుతున్న ఈ ప్రయోగాత్మక చిత్రాన్ని అతి త్వరలో విడుదల చేయనున్నామని తెలిపారు. 

పద్మ దేవీ ప్రభ సమర్పణలో రూపొందిన ఈ చిత్రానికి శ్రీకాకుళం జిల్లాకు చెందిన పలువురు సహ నిర్మాతలుగా వ్యవహరించారని పేర్కొన్నారు. విశాఖపట్నం, హైద్రాబాద్‌, బెంగళూరు నగరాలతో సహా శ్రీకాకుళం జిల్లాలో సీతంపేట మన్యం పరిసర ప్రాంతాలలో చిత్రీకరణ సాగిందన్నారు. పోస్టర్‌ విడుదల వేడుకలో హీరో వినీత్‌, సినిమాటోగ్రఫర్‌ రిషి ఎదిగ, పబ్లిసిటీ డిజైనర్‌ ఎంకేఎస్‌ మనోజ్‌ తదితరులు పాల్గొన్నారు. 

click me!