కాజోల్ బాగా యాటిట్యూడ్‌ చూపిస్తోందిః అభిమానుల షాకింగ్‌ కామెంట్స్

Published : Aug 06, 2021, 08:33 PM IST
కాజోల్ బాగా యాటిట్యూడ్‌ చూపిస్తోందిః అభిమానుల షాకింగ్‌ కామెంట్స్

సారాంశం

కాజోల్‌ బర్త్ డే సందర్భంగా ఆమె అభిమానులు ఎంతో ఆశగా ఆమె ఇంటికి చేరుకున్నారు. జుహూలోని ఇంటి వరకు కేక్‌తో వచ్చారు. కాజోల్‌తో కట్ చేయించాలని తపించారు. 

బాలీవుడ్‌ నటి కాజోల్‌పై ఫ్యాన్స్, నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమె చేసిన పనికి మండి పడుతున్నారు. సోషల్‌ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. కాజోల్‌ ఇలా చేస్తుందని అనుకోలేదని, ఆమెకి చాలా యాటిట్యూడ్‌ ఉందని కామెంట్లు పెడుతుండటం ఇప్పుడు వైరల్‌ అవుతుంది. మరి ఇంతకి ఏం జరిగిందనేది చూస్తే, కాజోల్‌ బుధవారం తన 47వ పుట్టిన రోజు జరుపుకుంది. కారోనా నేపథ్యంలో ఎలాంటి హడావుడి లేకుండా చాలా సింపుల్‌గా ఇంట్లో బర్త్ డే వేడుక చేసుకుంది కాజోల్‌. 

అయితే కాజోల్‌ బర్త్ డే సందర్భంగా ఆమె అభిమానులు ఎంతో ఆశగా ఆమె ఇంటికి చేరుకున్నారు. జుహూలోని ఇంటి వరకు కేక్‌తో వచ్చారు. కాజోల్‌తో కట్ చేయించాలని తపించారు. ఎట్టకేలకు కాజోల్‌ ఇంట్లోనుంచి బయటకు వచ్చింది. దీంతో వారంతా హ్యాపీగా ఫీలయ్యారు. ఆమె కేక్‌ కట్‌ చేసింది. వారంతా బర్త్ డే పాట పాడారు. ఇంత వరకు బాగానే ఉంది. కానీ చిన్న కేక్‌ పీస్‌ తినండని వాళ్లు రిక్వెస్ట్ చేయగా, కాజోల్‌ తిరస్కరించింది. తల ఊపుతూ తాను తినలేనని చెబుతూ ఇంట్లోకి వెళ్లిపోయింది. 

దీంతో అక్కడే ఉన్న అభిమానులు కాస్త నిరాశ చెందారు. వారికి ఫోటోలు దించుకునేందుకు అవకాశం ఇచ్చింది. కానీ వాళ్లతో ఫోటోలు దిగేందుకు నిరాకరించింది. కొన్ని సెకన్లలోనే అక్కడి నుంచి వెళ్లి పోయింది కాజోల్‌. దీంతో వాళ్లంతా హర్ట్ అయ్యారు. ఈ వీడియోని సోషల్‌ మీడియాలో పోస్ట్ చేయగా, దీనికి విపరీతమైన నెగటివ్‌ కామెంట్లు వస్తున్నాయి. కాజోల్‌ చేసిన పనికి నెటిజన్లు ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు. 

`డబ్బులు వేస్ట్, కేక్‌ వేస్‌.. టైమ్‌ వేస్ట్` అని, `ఆమెకు ఎంత అహంకారమో చూడండి`  'నా సిస్టర్‌ ఒకసారి కాజోల్‌ను కలిసింది. అసలు ఆవిడ కనీసం మాట్లాడటానికి కూడా ఆసక్తి చూపించలేదు`, `కాజోల్‌ స్క్రీన్‌ మీద కనిపించినట్లు రియల్‌ లైఫ్‌లో ఉండదు, బాగా యాటిట్యూడ్‌ చూపిస్తోంది`, `ఎంత హీరోయిన్‌ అయితే మాత్రం అంత పొగరు పనికిరాదు` అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా కాజోల్‌ చివరిసారిగా 'త్రిభంగ' సినిమాలో నటించింది. కాజోల్‌ బాలీవుడ్‌ హీరో అజయ్‌ దేవగన్‌ భార్య అనే విషయం తెలిసిందే. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Tanuja Bad Luck : జాక్ పాట్ మిస్సైన తనూజ.. బిగ్ బాస్ తెలుగు 9 రన్నరప్ బ్యాడ్ లక్, విన్నర్ ను మించిన రెమ్యునరేషన్ మిస్
Gunde Ninda Gudi Gantalu: మనోజ్ కి నడిచొచ్చే కొడుకు.. రోహిణీ గతం బయటపడుతుందా? బాలుకి అబద్ధం చెప్పిన మీనా