బర్త్ డే సందర్బంగా ఫ్యాన్స్ కి మహేష్‌ రిక్వెస్ట్.. ఆ పని చేయండి..

Published : Aug 06, 2021, 04:17 PM IST
బర్త్ డే సందర్బంగా ఫ్యాన్స్ కి మహేష్‌ రిక్వెస్ట్.. ఆ పని చేయండి..

సారాంశం

ప్రకృతి సమతుల్యత, కాలుష్య నివారణ దిశగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేపడుతున్న కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటి తనపై అభిమానం చాటుకోవాలని ఇన్ స్టాగ్రామ్ వేదికగా తన అభిమానులకు మహేష్‌ బాబు పిలుపునిచ్చారు.

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు పుట్టిన రోజు పుట్టిన రోజు ఈ నెల 9. ఈ సందర్భంగా తన అభిమానులందరూ  మొక్కలు నాటాలని మహేష్‌ పిలుపునిచ్చారు. ప్రకృతి సమతుల్యత, కాలుష్య నివారణ దిశగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేపడుతున్న కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటి తనపై అభిమానం చాటుకోవాలని ఇన్ స్టాగ్రామ్ వేదికగా తన అభిమానులకు మహేష్‌ బాబు పిలుపునిచ్చారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా తన పుట్టిన రోజున మొక్కలు నాటాలని మహేష్‌ తన అభిమానులకు పిలుపునివ్వడం పై గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఫౌండర్ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు.

 పెద్ద ఎత్తున అభిమానులున్న మహేష్‌ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా తన అభిమానులకు తలా మూడు మొక్కలు నాటాలని పిలుపునివ్వడం, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం పట్ల మహేష్‌కున్న అభిమానానికి నిదర్శనం అని అది గొప్ప విషయమన్నారు. జన హృదయాల్లో ప్రిన్స్ గా ఉన్న సూపర్ స్టార్ మహేష్‌ పిలుపు  తన హృదయాన్ని కదిలించిందని ఎంపీ సంతోషం వ్యక్తం చేశారు. మహేష్‌ వంటి గొప్పవ్యక్తుల మద్దతుతోనే గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విజయవంతంగా ముందుకు సాగుతున్నదని,  ఈ సందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్ తన ట్విట్టర్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు.

గతంలో కూడా తన పుట్టిన రోజును పురస్కరించుకుని మహేష్‌ మొక్కలు నాటారని ఎంపీ సంతోష్ కుమార్  గుర్తు చేసుకున్నారు. భౌతిక ఆస్తులు అంతస్తులు మాత్రమే కాదని, రేపటి తరాలకు మనం కూడబెట్టాల్సింది వారు సుఖంగా జీవించడానికి కావాల్సిన ప్రకృతి పచ్చదనాన్ని అందించడమే మన కర్తవ్యంగా ఉండాలని, సీఎం కేసీఆర్‌ అంటుంటారని ఎంపీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. సిఎం కెసిఆర్ హరితహారం  స్పూర్తితో తాను కొనసాగిస్తున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో మహేష్‌ పాలుపంచుకోవడం గొప్ప విషయమని అది ఆయన అభిమానులకే కాకుండా ప్రతి వొక్కరికీ స్పూర్తిదాయకమన్నారు. 

పచ్చదనం పలచబడడంతో విశ్వ వేదికమీద  ప్రకృతి సమతుల్యత రోజు రోజుకూ దెబ్బతిని పోతున్నదని, ఈ నేపథ్యంలో పచ్చదనాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిమీద వున్నదని ఎంపీ పునరుద్ఘాటించారు. ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా నేపథ్యంలో   ప్రపంచ పర్యావరణం పట్ల మహేశ్ బాబు వంటి ప్రజాదరణ కలిగిన ప్రముఖ హీరోలు ప్రకృతి కోసం మనసు కేంద్రీకరించడం మహోన్నతమైన విషయమన్నారు. మహేష్‌ పిలుపు మేరకు అగస్టు 9 న మనిషికి వొక్కంటికి మూడు మొక్కలు నాటుతున్న ప్రపంచ వ్యాప్తంగా వున్న మహేశ్ బాబు అభిమానులకు ఎంపీ సంతోష్ కుమార్ అభినందనలు తెలిపారు. మహేష్‌ పేరుతో నాటుతున్న మొక్కలు వృక్షాలుగా పెరిగి పెద్దవయి ఎందరికో నీడనిస్తూ చిరకాలం నిలుస్తాయని ఎంపీ ఆశాభావం వ్యక్తం చేశారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Demon Pavan Remuneration : 15 లక్షల జాక్ పాట్ తో పాటు, డిమాన్ పవన్ రెమ్యునరేషన్ టోటల్ గా ఎంతో తెలుసా?
Bigg Boss Telugu: ఈ విషయంలో అందరూ ఫెయిల్ అయ్యారు, బిగ్ బాస్ పై మండిపడ్డ రోహిణీ