
టీవీ సీరియల్స్ కి, ఐపీఎల్‌కి ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. జనరల్‌గా కొన్ని సీరియల్స్ అభిమానులుంటారు. కానీ కొందరు డై హార్డ్ ఫ్యాన్స్ కూడా ఉన్నారని ఓ ట్విట్టర్ యూజర్ నిరూపించాడు. మరి ఆ అభిమాని ఏం చేశాడో తెలిస్తే నవ్వాపుకోలేరు. ఇంతకి ఏం చేశాడో తెలుసా?
ఇక సీనియర్ ఫ్యామిలీ అంతా కలిసి చూస్తుంటారు. కొన్నినచ్చిన సీరియల్స్ ని మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ వదులుకోరు. అదే సమయంలో ఐపీఎల్ ఉంటే ఆ ఇంట్లోపెద్ద చిక్కు వచ్చినట్టే. ఐపీఎల్‌కి కచ్చితంగా అభిమానులుంటారు. ముఖ్యంగా కుర్రాళ్ళు, మగవాళ్ళు దాన్ని ఇష్టపడతారు. ఈ నేపథ్యంలో ఒకేసారి సీరియల్, ఐపీఎల్ ప్రసారమయితే ఇక ఆ ఇంట్లో పెద్ద కల్లోలమే.
ఇదే విషయాన్ని ఓ వ్యక్తి ముందుగానే గుర్తించాడు. అందుకే బీసీసీఐ అధ్యక్షుడు సౌరబ్ గంగూలీకి రిక్వెస్ట్ చేసుకున్నారు. పవిత్రపు శివచరణ్ అనే నెటిజన్ ట్విట్టర్ సౌరబ్ గంగూలీకి ఓ పోస్ట్ పెట్టాడు. `గంగూలీ సర్ ఐపీఎల్ టైమ్‌ని 7.30పీఎం నుంచి 8పీఎం గంటలకు మార్చండి. 7.30పీఎంకి మా ఫ్యామిలీ `కార్తీకదీపం` సీరియల్ చూస్తుంది. మా ఇంట్లో ఓకే ఒక టీవీ ఉంది. అందుకే ఆ మార్పు చేసి మా ఇంట్లో గొడవలు లేకుండా చేయండి` అని ట్వీట్ చేశాడు. చెన్నైఐపీఎల్, స్టార్‌మాని ట్యాగ్ చేశారు. ఇప్పుడిది నెటిజన్లకి నవ్వులు పూయిస్తుంది. చూసిన వారంతా డై హార్డ్ ఫ్యాన్స్ అంటూ `సాహో` చిత్రంలోని డైలాగ్ సీన్‌ని మీమ్‌గా జోడిస్తున్నారు.
దీంతోపాటు స్టార్‌మా స్పందించింది. ఇది చాలా నిజాయితీతో కూడిన రిక్వెస్ట్` అనికామెంట్ పెట్టారు. కార్తీకదీపం స్టార్‌మాలో ప్రసారం కానున్న విషయం తెలిసిందే. ఇందులో డాక్టర్ బాబు, వంటలక్క పాత్రలు బాగా ప్రాచూర్యం పొందాయి. స్టార్ మా ట్వీట్‌కి శివచరణ్ స్పందిస్తూ, స్టార్‌మామీరైనా స్టార్ ఇండియాకి చెప్పండి. ఐపీఎల్ మ్యాచ్‌లకు ఎనిమిది గంటలకు ప్రారంభించాలి` అని కోరారు.
ఐపీఎల్ మరో 15రోజుల్లో దుబాయ్ వేదికగా జరుగుతుంది. మరికొన్ని గంటల్లో దీనికి సంబంధించిన షెడ్యూల్ ప్రకటించననున్నారు. ఈ నెల 19 నుంచి నవంబర్ 10వరకు మొత్తం 53రోజుల్లో అరవై మ్యాచ్‌లు జరుగుతాయని ప్రకటించింది. ఇందులో పది డబుల్ హెడర్ మ్యాచ్‌లకు ప్లాన్ చేస్తుండగా, ఈ సీజన్‌లో పోలిస్తే అరగంట ముందే ఐపీఎల్ మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. దీంతో మధ్యాహ్నం నాలుగు గంటలకు బదులుగా 3.30లకు, రాత్రి ఎనిమిది గంటలకు బదులుగా 7.30కి మ్యాచ్ లు ప్రారంభం కానున్నాయి. ఈ టైమింగ్ మార్చాలని పవిత్రపు శివచరణ్ తన ఆవేదన పంచుకున్నారు.
ఇదిలా ఉంటే ఈ సారి ఐపిఎల్ ప్రధానంగా టీవీ, ఆన్‌లైన్ వ్యూవర్స్ ని నమ్ముకుంది. డైరెక్ట్ గా స్టేడియంలోకి ఆడియెన్స్ రావడం కష్టం. అందుకే టైమింగ్‌లో మార్పులు చేసినట్టు తెలుస్తుంది. రాత్రిమ్యాచ్ పూర్తవడానికి అర్థరాత్రి అవుతున్న నేపథ్యంలో వ్యూవర్స్ తగ్గిపోతారని, దీని కోసం టైమింగ్ మార్చినట్టు బీసీసీఐ చెబుతుంది. మరి శివచరణ్ రిక్వెస్ట్ ని గంగూలీ పరిగణలోకి తీసుకుంటాడా? చూడాలి.